రాజధాని రైతుల పోరాటం ఫలించింది.అమరావతి కేంద్రంగా ఏర్పాటయ్యే రాజధాని విషయమై,ఆ రోజు చంద్రబాబు సర్కారు సేకరించిన భూముల విషయమై మరోమారు హై కోర్టు స్పష్టమయిన వైఖరితో కూడిన తీర్పు వెల్లడి చేసింది.రాజధానికి సంబంధిం చి సేకరించిన భూములను ఇతర అవసరాలకు వాడకూడదని, వాటిని తాకట్టు పెట్టవద్దని కూడా ఇవాళ హై కోర్టు తీర్పు వెలువరించింది.
సీఆర్డీఏ చట్ట ప్రకారం ప్రభుత్వం నడుచుకోవాలి అని స్పష్టం చేయడంతో పాటు ఆరు నెలల్లో పనులకు సంబంధించి న మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని కూడా చెప్పింది.దీంతో పాటు సీఆర్డీఏ చట్టంలో పేర్కొన్న విధంగా భూములు ఇచ్చిన రైతులను ఆదుకోవాలని, మూడు నెలల్లో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలని కూడా ఆదేశించింది.
వీటితో పాటు రాజధాని అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించేందుకు వీల్లేదని అంటోంది.ఇదే విషయాన్ని తీర్పు కాపీలో కూడా స్పష్టంగా పేర్కొంది.ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి డైలామాలో పడిపోయింది.ఇందుకు సంబంధించి న్యాయ సంబంధ సలహాల స్వీకరణకు,సేకరణకు సిద్ధమవుతోంది.అంతేకాదు త్వరలో సుప్రీం కోర్టుకు కూడా వెళ్లాలని యోచిస్తోంది.అయితే సీఆర్డీఏ చట్టం రద్దు నిర్ణయంను తాము ఎప్పుడో వెనక్కు తీసుకున్నామని బొత్స అంటున్నారు.
అంతేకాదు 3 రాజధానుల బిల్లును కూడా తాము వెనక్కు తీసుకున్నామని ఇందుకు సంబంధించి అసెంబ్లీ వేదికగానే స్పష్టమయిన ప్రకటన ఒకటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర చేశారని అంటున్నారు.ఈ దశలో బడ్జెట్ సమావేశాల్లో మరోసారి 3 రాజధానుల బిల్లు తీసుకుని రావాలని కలలు కంటున్న వైసీపీ నేతలకు చుక్కెదురయింది.
సీఆర్డీఏ చట్టం యథాతథంగానే అమలు అవుతున్నుందున రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే ఓ స్పష్టమయిన విధానం ప్రకటిస్తూ హై కోర్టు నుంచి తీర్పు రూపంలో వెలువడినందున ఇప్పటికిప్పుడు కొత్త బిల్లు తీసుకువచ్చే సాహసం అయితే చేయదు.
అదేవిధంగా సీఆర్డీఏ భూములను తనఖా పెట్టేందుకు కూడా వీలులేనందున ఇప్పటికిప్పుడు వీటిపై ఏ నిర్ణయం కూడా తీసుకునేందుకు కోర్టు తీర్పు నేపథ్యంలో లేకుండా పోయింది.అందుకే మళ్లీ మళ్లీ పాత పాటే అందుకుంటున్నారు బొత్స. తాము ఇప్పటికీ 3 రాజధానుల నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని చెబుతున్నారు. కానీ చట్ట ప్రకారం సీఆర్డీఏ పరిధిలో రాజధాని నిర్మాణంపై ఎటూ తేల్చకుండా, ఏ విషయమై స్పష్టత ఇవ్వకుండా మూడు రాజధానులపై ముందుకు పోయేందుకు వీలేలేదు.
అదేవిధంగా రాజధాని నుంచి ఒక్క కార్యాలయాన్ని కూడా తరలించకూడదని కూడా అంటోంది హైకోర్టు.అంటే విశాఖ ప్రాంతానికి సచివాలయం తరలింపు అన్నది ఇప్పట్లో సాధ్యం కాదు.సీఆర్డీఏ చట్టం రద్దుకు సంబంధించి ఏ అధికారంఅసెంబ్లీ కి లేదు అని కూడా స్పష్టం చేసింది కనుక లేని అధికారంతో చట్టాల రద్దుకు ఉపక్రమించకూడదు అని కూడా తేల్చేసింది.
దీంతో న్యాయ వ్యవస్థకూ, శాసన వ్యవస్థ కూ మధ్య తగాదాగా దీనిని మార్చేందుకు వైసీపీ కొన్ని పావులు కదుపుతోందని టీడీపీ అంటోంది.అయినా కూడా తాము వీటిని అడ్డుకుంటామని ఆంధ్రుల రాజధాని అమరావతే అన్నది తీర్పు ద్వారా స్పష్టం అవుతోందని టీడీపీ వెల్లడి చేస్తోంది.