భారతదేశంలో 151 సీట్లు గెలిచిన వారు ఏపీలో సీఎం అయ్యారు. 110 సీట్లు గెలిచిన వారు సీఎం అయ్యారు. కర్ణాటకలో మెజారిటీ రాని వారు సీఎం అయ్యారు. 30 పై చిలుకు సీట్లతో సీఎం అయ్యారు. అలాగే బీహార్ లో ఎక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తి కాకుండా మరో వ్యక్తి సీఎం… అయ్యారు. ఇది రాజ్యాంగం శక్తి. ఎలా సీఎం అయినా అందరి సీఎంల పవర్ సేమ్. దానిని వాడే విధానం బట్టి ఆ రాష్ట్ర అభివృద్ధి ఆధారపడి ఉంటుంది.
ఏపీ ముఖ్యమంత్రి 151 సీట్లు రావడం వల్ల దేశంలో ఇతర ముఖ్యమంత్రి కంటే ఎక్కువ పవర్ తనకు దఖలు పడిందనుకుంటున్నట్టు ఉన్నారు. అందుకే ఇతర సీఎంలు చేయని పనులు చేస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం కోర్టులో కొట్టివేయబడే పనులు చేస్తున్నారు. జగన్ చేసిన అతిపెద్ద తప్పు ‘అమరావతి‘ని ఆపేయడం. ఇది జగన్ కి ఆయన టీంకి తప్ప అందరికీ అర్థం అయ్యింది. భవిష్యత్తులో ఏపీ రాజధానిగా అమరావతే కొనసాగుతుంది. ఇది అందరికీ తెలుసు. ఎందుకంటే రాజ్యాంగానికి, న్యాయస్థానానికి ఆ పవర్ ఉంది. జస్టిస్ ఎపుడూ నిలబడుతుంది. అయితే, దానిపై పోరాటం ఎంత అవగాహనతో చేస్తే అంత త్వరగా అమరావతి గెలుస్తుంది. అలా గెలవాలి అంటే న్యాయపరమైన విషయాలపై, క్షేత్ర స్థాయి వాస్తవాలపై మనకు అవగాహన పట్టు ఉండాలి. పోరాటంపై పట్టుదల ఉండాలి.
కొంత తెలిసి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్న వారికి, ఏమీ తెలియకపోయినా పూర్తిగా తెలుసుకోవాలనుకున్న వారికి ఇపుడు ఒక అవకాశం వచ్చింది. సీనియర్ న్యాయవాది నర్రా శ్రీనివాస రావు జూమ్ వెబినార్ పెడుతున్నారు. ఎవరైనా దీనికి హాజరు కావచ్చు. అమరావతి పోరాటానికి అవసరమైన క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకోవచ్చు.
అంశం – అమరావతి న్యాయం కోసం పోరాటం = క్షేత్రస్థాయి వాస్తవాలుతేదీ – 05-12-2020
మీటింగ్ ఐడి – 85411245428పాస్ కోడ్ – helper
హోస్టెడ్ బై – హెల్పర్ ఫౌండేషన్, యుఎస్ఎ (www.helper.foundation)