ఆమంచి కృష్ణమోహన్. ప్రకాశం జిల్లా చీరాలలో జరుగుతున్న మునిసిపల్ ఎన్నికల్లో తన సత్తా చాటుకునేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. వాస్తవానికి ఇక్కడ 33 వార్డుల్లోనూ ఆమంచి ఎంపిక చేసిన వారిలో ఒక్కరికీ కూడా వైసీపీ బీ ఫారం ఇవ్వలేదు. కానీ.. టీడీపీ నుంచి వచ్చి వైసీపీ కి మద్దతు దారుగా మారిన కరణం బలరాం వర్గం సూచించిన వారికి అందరికీ బీ ఫారం ఇచ్చింది. ఇక, మొత్తం వార్డుల్లో 3 ఏకగ్రీవం కాగా 30 వార్డులకు ఈ నెల 10న ఎన్నికలు జరుగుతున్నాయి.
అయితే… ఆది నుంచి కూడా కరణం వర్గాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆమంచి.. వైసీపీ బీఫారం ఇవ్వకపో వడం. తన వర్గాన్ని అవమానించినట్టుగా భావిస్తున్నారు.. ఈ నేపథ్యంలో తనే స్వయంగా రంగంలోకి దిగి.. తనవారిని పోటీకి దింపారు. వీరంతా కూడా రెబెల్స్‌గా బరిలో నిలబడ్డారు.
స్వయంగా వీరి తరఫున ఆమంచి రంగంలోకి దిగారు. ఈ పరిణామాన్ని గుర్తించిన వైసీపీ అధినాయకుడు జగన్.. వెనక్కి తగ్గాలని ఆమంచికి సూచించారని ప్రచారం జరుగుతోంది. అయితే.. ఇప్పటి వరకు ఎవరూ కూడా వెనక్కి తగ్గలేదు.
అంటే.. వైసీపీకి వ్యతిరేకంగా ఆమంచి జెండా ఎగరేసేందుకు రెడీ అయిపోయారు. ఈ పరిణా మం.. రాజకీయంగా కాకరేపుతోంది. ఇప్పటి వరకు ఉన్న అంచనాలను బట్టి.. కరణం వర్గంపై స్థానికంగా గుడ్ ఫీల్ రావడం లేదు. ఎక్కడికక్కడ.. వీరిపై జంప్ జిలానీలు అనే ముద్ర పడిపోతోంది. దీనికి తోడు సోషల్ మీడియాలోనూ కరణం వర్గం.. ఆయన దూకుడు కారణంగా ఆమంచి వర్గానికి అన్యాయం జరుగుతోందనే భావన స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే ప్రచారం జరుగుతోంది.
ఇక, ఇప్పుడు ఆమంచి వర్గంగా ఉన్నరెబెల్స్ దూకుడు ఎక్కువగా కనిపిస్తోంది. దీనిని బట్టి చీరాల ఎన్నికల్లో రెబెల్ అభ్యర్థులు విజయం సాధిస్తే.. ఆమంచికి వ్యక్తిగతంగా రాజకీయం.. మరో మలుపు తిరగడం ఖాయమని చెబుతున్నారు. ఇది అధికార పార్టీపై ఓవర్ టేక్ చేసేందుకు అవకాశం ఇచ్చినట్టే అవుతుందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.