టాలీవుడ్ లోని క్యూట్ కపుల్స్ లో ఒకరిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహ రెడ్డిల జంటకు మంచి పేరున్న సంగతి తెలిసిందే. షూటింగ్ ల నుంచి ఏ మాత్రం గ్యాప్ దొరికినా తన భార్య స్నేహారెడ్డితో పాటు పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హాలతో గడిపేందుకు బన్నీ ఎక్కువగా ఇష్టపడుతుంటాడు. ఇక భార్యను అమితంగా ప్రేమించే బన్నీ తమ పెళ్ళి రోజుతో పాటు స్నేహారెడ్డి బర్త్ డేని కూడా మిస్ కాకుండా సెలబ్రేట్ చేస్తంటాడు.
ఈ క్రమంలోనే తాజాగా సెప్టెంబరు 29న స్నేహారెడ్డి బర్త్ డే సందర్భంగా తన భార్యకు బన్నీ బర్త్ డే విషెస్ చెబుతూ ఇన్ స్టా గ్రామ్ లో ఓ ఫొటో పోస్ట్ చేశాడు. హ్యాపీ బర్త్ డే క్యూటీ అంటూ స్నేహ రెడ్డి కేక్ కటింగ్ ఫొటోను బన్నీ షేర్ చేశాడు. అల్లు అయాన్, అల్లు అర్హల సమక్షంలో ఈ సెలబ్రేషన్స్ నిరాడంబరంగా జరిగాయి. వారి సమక్షంలో సింపుల్ గా స్నేహారెడ్డితో బన్నీ కేక్ కట్ చేయించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక, స్నేహారెడ్డి బర్త్ డే సందర్భంగా అల్లు అర్జున్ ఫ్యామిలీ మొత్తం అమృత్ సర్ లోని సిక్కుల ప్రముఖ పుణ్యక్షేత్రం స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. అల్లు అర్హ, అల్లు అయాన్ కలిసి అల్లు అర్జున్, స్నేహా రెడ్డిలు సిక్కుల సంప్రదాయం ప్రకారం తలన సంప్రదాయ వస్త్రంతో కప్పుకొని ఆ దేవాలయాన్ని సందర్శించారు. దేవాలయంలో అల్లు అర్జున్ ఫ్యామిలీ దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
2011 మార్చిలో అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల వివాహం జరిగింది. 2014లో అల్లు అయాన్ జన్మించగా, 2016లో అల్లు అర్హ జన్మించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు స్నేహా రెడ్డి. ప్రస్తుతానికి బన్నీ పుష్ప-2 షూటింగ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. మరి కొద్ది రోజుల్లోనే పుష్ప-2 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.