స్టైలిష్ స్టార్, ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్‌లో 16 మిలియన్ల మంది ఫాలోవర్లను సాధించారు, ఇది దక్షిణాది నటుడికి గొప్ప మైలురాయి.
అల్లు అర్జున్ పుష్ప ముందు ఒక లెక్క. పుష్ప తర్వాత ఒక లెక్క. ప్రస్తుతం బన్నీ బాక్సాఫీస్ పుష్ప ది రైజ్ అని టైటిల్ కి తగ్గట్టే … రోజురోజుకు రైజ్ అవుతున్నాడు.
ప్రాంతీయ సినిమాతో నేషనల్ స్టార్ అయిన అల్లు అర్జున్ రాంగోపాల్ వర్మ చెప్పినట్టు అల్లు ఈజ్ న్యూ మెగా అనుకోవాలి. నిజాలు ఒప్పుకోవాలి తప్పదు కదా.
5 భాషల్లో OTT ప్లాట్‌ఫారమ్‌లలో విడుదలైన ఈ చిత్రం సినీ ప్రేమికులను భారీగా ఆకట్టుకుంటోంది. పుష్ప: ది రైజ్ అల్లు హీరోని మరో లెవెల్ కి తీసుకెళ్లింది. ఇంతకుముందు యువ నటుడు విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లతో సౌత్ ఇండియన్ స్టార్‌గా ఉన్నాడు. దానిని అల్లు అర్జున్ ఇప్పుడు చెరిపేశారు.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో పుష్ప ప్రీమియర్లకు ముందు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 15 మిలియన్ల మంది అనుచరులను కలిగి ఉన్నారు. ఇపుడు మరో పది లక్షలు పెరిగారు. ప్రస్తుతం అతనికి 16 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ క్రెడిట్ సుకుమార్ మాగ్నమ్ ఓపస్ ‘పుష్ప: ది రైజ్‘ సినిమాదే అని చెప్పాలి.
ఈ సినిమా అల్లు అర్జున్ స్టార్‌డమ్‌ను కొత్త శిఖరాలకు చేర్చింది. గత 10 రోజుల్లోనే 10 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. విజయ్ దేవరకొండ ఇప్పుడు 14.5 మిలియన్ ఫాలోవర్లతో రెండో స్థానంలో నిలిచాడు.