అలహాబాద్ హైకోర్టు కు ఒక విచిత్రమైన కేసు వచ్చింది. బహుశా ఇలాంటి సమస్య మునుపు ఎన్నడూ మనం విని ఉండలేదు. ప్రేమ పెళ్లిళ్లు అంటే భర్త మేజర్, భార్య మైనర్ అనే కేసులు ఉంటాయి. లేకపోతే వధూవరులు ఇద్దరు మైనర్లు అనే కేసులు ఉంటాయి. కానీ ఈ కేసులో భర్త మైనర్, భార్య మేజర్. అంతకంటే ట్విస్ట్ ఏంటంటే… ఈ మైనర్ బాబు అపుడే బాబును కనేశాడు.
పిల్లలు కూడా పుట్టాక ఇందులో ఇంక కేసు ఏముంది అనుకుంటున్నారా? కానీ ఆ బాబు పుట్టాక ఈ బాబు తండ్రయ్యాడనే విషయం బయటకు వచ్చింది. అసలు కథ తెలుసుకుంటే మీ కన్ఫ్యూజన్ తీరిపోతుంది.
అబ్బాయి వయసు 17
ఆమె వయసు 22 కి పైనే.
అబ్బాయి మీద మోజు పడిన మహిళ అతనితో అన్నీ కానిచ్చేసింది.
వారిద్దరికి ఒక బాబు పుట్టాడు.
అసలు విషయం అబ్బాయి తల్లికి తెలియడంతో నిలదీసింది. అమ్మతో ఉండను పెళ్లాంతోనే ఉంటాను అంటూ అబ్బాయి గోల చేయడంతో తల్లి కోర్టుకు ఎక్కింది.
ఈ విచిత్రమైన కేసును విచారించిన అలహాబాద్ హైకోర్టు… అబ్బాయిని అడిగితే పెళ్లాంతోనే పోతాను అన్నాడు.
తల్లితో కలిసి జీవించడానికి అతనికి ఇష్టం లేదు
పెళ్లాంతో కలిసి జీవించేందుకు చట్టం ఒప్పుకోదు.
దీంతో 2022 ఫిబ్రవరి 4 వరకు అంటే 18 ఏళ్లు వచ్చే వరకు టీనేజర్ ను ప్రభుత్వ వసతి గృహంలోనే ఉంచాలని కోర్టు తీర్పు చెప్పింది. మైనారిటీ తీరిన తర్వాత అతనికి నచ్చిన వారితో కలిసి ఉండవచ్చని కోర్టు తేల్చిచెప్పింది.
మే 31 న ఇచ్చిన తీర్పును తాజాగా కోర్టు వెబ్సైట్లో సోమవారం అప్లోడ్ చేశారు. దీంతో విషయం బయటకు పొక్కింది. ఆ ఇరుకుటుంబాల క్షేమం దృష్టా వివరాలు పెద్దగా బయటపెట్టలేదు.
ఇది అజమ్ ఘర్ (Azamgarh) లో జరిగిన ఘటన.
ఫోక్సో చట్టం ఏం చెబుతోంది?
పోక్సో చట్టం ఒక మైనర్ అబ్బాయిని ఒక పెద్ద అమ్మాయితో సహజీవనం చేయడాన్ని నేరంగా పరిగణిస్తుంది. అందుకే భార్యతో బాలుడిని పంపడానికి కోర్టు అంగీకరించలేదు.