అసదుద్దీన్ ఒవైసీ… ఆయనదో వింత రాజకీయం. ఎక్కడో కాశ్మీర్ లో ఒక ముస్లిం యువకుడికి అన్యాయం జరిగితే ఎదిరిస్తాడు. పక్కనే ఉన్న ఏపీలో ఒక కుటుంబం మొత్తం సామూహిక ఆత్మహత్యకు పాల్పడితే అటువైపు కూడా చూడరు.
ఆయనదో విచిత్ర రాజకీయ ధోరణి. బీహార్ లో పోటీ చేసి లౌకిక ఓట్లు చీల్చి మోడీ గెలిచేలా చేశారు. బీజేపీతో అంటకాగే జగన్ నా ఫ్రెండ్, ఆయనకే నా సపోర్ట్ అంటాడు. మోడీని తిట్టే కేసీఆర్ తో జతకడతాడు. జగన్ మీద ఈగ వాలినా ఊరుకోడు. ఎన్నికలపుడు మై ఆగయా అంటాడు… ఒక ఫ్యామిలీ మొత్తం అన్యాయంగా వేధింపులతో చనిపోతే సైలెంటుగా ఉంటాడు. ఎందుకంటే ఫ్రెండ్ జగన్ కి డ్యామేజ్ కావొద్దు కదా. మన సోదర ఫ్యామిలీ కంటే జగన్ తో రాజకీయ ప్రయోజనాలు అసద్ భయ్యాకి ముఖ్యమా?
ఏమిటిది అసద్ భయ్
ఇంత అన్యాయమా?
నీది ఇంత కఠిన మనసా?
నిందితులకు శిక్ష పడేదాకా నిద్రపోవు అనుకున్నాం
కానీ నువ్వేంటి అసలు అటువైపు చూడటమే మానేశావు.
రా భయ్యా
ముస్లిం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వాడికి శిక్ష పడేదాకా
నిరాహార దీక్ష చేసి సాధించు భయ్యా… రా అసద్ భయ్యా రా