బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ డిసెంబర్లో టాలీవుడ్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించింది. డీమోనిటైజేషన్ తర్వాత 2016లో థియేటర్లలో విడుదలైన రామ్ చరణ్ ధృవ, రూ. 58 కోట్ల షేర్ సాధించి టాప్లో నిలిచింది. ఆ తర్వాత ఐదేళ్లకు బాలయ్య ఆ రికార్డును బద్దలు కొట్టాడు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొండి పట్టుతో బాలయ్యను పవన్ ను టార్గెట్ చేసి టిక్కెట్ రేట్లు భారీగా తగ్గించినా అఖండ 60 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు లేని తరుణంలో ఈ రికార్డు సృష్టించడం అద్భుతమని ట్రేడ్ పండితులు అంటున్నారు.
ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ అఘోరా/బాబా పాత్రలో కనిపించారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచే కాదు విమర్శకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసిన NBK యొక్క మొదటి చిత్రం అఖండ.
ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.