అలియా వచ్చింది...

బాలీవుడ్ అత్యంత వివాదాస్పద వ్యక్తి అయిన మహేష్ భట్ కూతురు అలియా భట్ RRR సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్ర చేస్తోన్న ఆలియా భట్ (Alia Bhatt ) సోమవారం నుంచి సినిమా షూటింగ్ లో రెగ్యులర్ గా పాల్గొనననుంది. రామ్ చరణ్, ఆలియా మధ్య కీలక సన్నివేశాల చిత్రీకరణ మొదలుకానుంది. ప్రస్తుతం రాజమౌళి, అలియా మాట్లాడుకుంటున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

RRR సినిమా మొత్తం బడ్జెట్ 300 కోట్లు అని చెబుతున్నారు. నిర్మాత డి.వి.వి.దానయ్య. రౌద్రం ర‌ణం రుధిరం ( RRR ) టైటిల్ ను ఫైనల్ చేశారు. చారిత్రక పాత్రలకు ఫిక్షన్‌ కలిపి తెరకెక్కిస్తున్నారు.  సినిమాలో తెలంగాణ వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ (Jr. NTR)‌, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా  రామ్‌చరణ్  (Ram charan) నటిస్తున్నారు. వారి హీరోయిన్లుగా అలియా భట్ (రామ్), ఒలీవియా మోరిస్  (తారక్) నటిస్తున్నారు. అజయ్ దేవగణ్ (Ajay Devgan), శ్రియ (Shriya Saran) కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.