ప్రముఖ సినీ నటుడు ఆలీని ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా నియమించబోతోందా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే అనుకోవాలి. ఎందుకంటే తొందరలోనే ఆలీని సలహాదారునిగా నియమించేందుకు జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయినట్లు పార్టీలో ప్రచారం బాగా జరుగుతోంది. ఆలీతో పాటు మరో ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళికి కూడా పదవీయోగం దక్కబోతోందట. అదేమిటంటే ఎఫ్డీసీ ఛైర్మన్ గా నియమించబోతున్నట్లు చెప్పుకుంటున్నారు. పోసాని కన్నా ముందు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ కు సీనియర్ నటుడు విజయచందర్ పనిచేశారు.
ఇక్కడ ఆలీ విషయం తీసుకుంటే సినిమాల్లో ప్రముఖుడే కానీ రాజకీయాల్లో పెద్దగా ప్రభావం చూపగలిగిన స్ధాయి అయితే లేదు. పోయిన ఎన్నికల్లో ఏవో కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ తరపున ప్రచారం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలీకి రాజ్యసభ పదవనే ప్రచారం జరిగింది. తర్వాత అదేమీలేదు ఎంఎల్సీగా ఇవ్వబోతున్నారని చెప్పుకున్నారు. రాజ్యసభ లేదా ఎంఎల్సీ పదవుల విషయంలో మీడియాలో చాలా విస్తృతంగా ప్రచారం జరిగింది.
చివరకు రెండు పదవులు కూడా ఆలీకి దక్కలేదు. తర్వాత ఏదో పదవి గ్యారెంటీగా ఇస్తారనే ప్రచారం మొదలై ఆగిపోయింది. ఇపుడు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించేందుకు అవసరమైన ఫైల్ జగన్ టేబుల్ దగ్గరుందని అంటున్నారు. నిజానికి ఆలీకి ఎలక్ట్రానిక్ మీడియాకు ఏమి సంబంధమో అర్ధం కావటం లేదు. ఎవరు ఏ పదవిలో అయినా నియమితులు కావచ్చు కానీ పర్టిక్యులర్ పదవులకు ఆ రంగంలో కనీస పరిజ్ఞానం ఉండితీరాలి. ఇపుడు ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేయటమంటే చిన్న విషయం కాదు.
ముందు మీడియా రంగంలోను తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసుంటేనే పదవికి న్యాయం చేసినట్లవుతుంది. పైగా ఎలక్ట్రానిక్ మీడియా సలహదారులుగా ఇప్పటికే ప్రభుత్వం నియమించుకున్నది. బహుశా వాసుదేవరెడ్డి అనే ఎన్ఆర్ఐ వ్యక్తి పనిచేస్తున్నట్లున్నారు. మరలాంటపుడు కొత్తగా ఆలీని సలహాదారుగా ఎంపిక చేయటం వల్ల ఉపయోగం ఏమిటో అర్ధం కావటంలేదు.
Comments 1