అక్కినేని అఖిల్…అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ యంగ్ హీరో కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, అటు ఎంగేజ్ మెంట్ కూడా క్యాన్సిల్ కావడంతో పర్సనల్ లైఫ్ లో కూడా అఖిల్ కు బ్యాడ్ టైం నడుస్తోంది. మంచి హిట్ అని చెప్పుకోదగ్గ సినిమా అఖిల్ కు ఒక్కటి కూడా లేదంటే ఫ్యాన్స్ కు కోపం వస్తుందేమోగానీ…అదే నిజం. అయితే, అఖిల్ ఇలా కెరీర్ పరంగా, అటు పర్సనల్ లైఫ్ పరంగా సక్సెస్ కాకపోవడానికి కారణమేంటి అన్న విషయంపై ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అక్కినేని అమల వల్లే అఖిల్ కెరీర్ సక్సెస్ ఫుల్ గా లేదని వేణు స్వామి షాకింగ్ కామెంట్లు చేశారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుడు నీచ స్థానంలో ఉండడం వల్ల అక్కినేని కుటుంబాలకు వ్యక్తిగతంగా, సినీపరంగా పెద్దగా కలిసి రావట్లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా అఖిల్ కెరీర్ విషయంలో అమల జోక్యం చేసుకోవడం మానేస్తే అఖిల్ తప్పకుండా విజయం సాధిస్తారంటూ వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో సంచలనం రేపుతున్నాయి.
అయితే, వేణు స్వామి ఇలా ఒక్క అఖిల్ గురించే కాదు…గతంలో కూడా పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల గురించి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. నాగ చైతన్య, సమంత విడిపోతారని పెళ్లికి ముందే చెప్పారు. ఆయన చెప్పినట్లు చై, సామ్ లు విడిపోవడంతో ఒక్కసారిగా వేణు స్వామి వార్తల్లో నిలిచారు. 2020లో హీరో కృష్ణ, విజయనిర్మలలో ఒకరు చనిపోతారని 2004లోనే చెప్పానని, దానికి పరిహారం చేసుకోవాలని సూచించానని వేణు స్వామి కొద్ది రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు.
నరేష్, రమ్య రఘపతిగార్ల జాతకాలు కలవలేదని, విడాకులు తీసుకుంటారని తాను చెప్పినా వినలేదని షాకింగ్ కామెంట్లు చేశారు. తాను ఓపెన్‌గా ఈ విషయాలు చెప్పినప్పటి నుంచి తనను దూరం పెట్టారని, తాను కూడా అప్పటి నుంచి వారింటికి వెళ్లడం మానేశానని అన్నారు. నిజానికి తాను ఆ సమయంలో చెప్పిన రెండు విషయాలు నిజమయ్యాయంటూ కొద్ది రోజుల క్రితం ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు స్వామి అన్నారు.