తెలుగు మాస్ యాక్షన్ స్టార్ బాలకృష్ణ ‘అఖండ’తో గురువారం నుంచి తన తడాఖా చూపిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా అమెరికాలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది.
రికార్డ్ ఓపెనింగ్స్ తో అదరగొట్టి…
ఇప్పటికే US లో $ 500,000 వసూలు చేసింది,
‘అఖండ’ విడుదలైన రెండు రోజుల్లోనే USలో $500,000 మైలురాయిని అధిగమించింది.
వీకెండ్లో ఎక్కువ మంది థియేటర్లలో సినిమాను చూసే అవకాశం ఉన్నందున, ఓవర్సీస్లో $1 మిలియన్ క్లబ్లో ఈ చిత్రం చేరుతుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
మౌత్ టాక్ సినిమా కలెక్షన్లపై గొప్ప ప్రభావాన్ని చూపిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
కరోనా తర్వాత వచ్చిన మొదటి పెద్ద తెలుగు మాస్ సినిమా కావడంతో జనం సంబరాలు చేసుకుంటున్నారు.
కుటుంబాలు కుటుంబాలే తరలివస్తున్నాయి.
ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఏరియాల్లో ‘అఖండ’ బాక్సాఫీస్‌కు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి.
మూడో రోజు కలెక్షన్లు హౌస్ ఫుల్ తో నడవడం విశేషం.
బాలకృష్ణ యాక్షన్ సన్నివేశాలు మరియు S.S. థమన్ అద్భుతమైన సంగీతం సినిమా విజయానికి దోహదం చేశాయని పబ్లిక్ టాక్.
‘అఖండ’లో ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, బాలకృష్ణ బహుళస్థాయి పాత్రలు పోషిస్తున్నారు.