బాలయ్య అభిమానులకు సినిమా చూశాక పూనకాలు వస్తున్నాయి. ఫ్యాన్స్ కి ఈ సినిమా షడ్రషోపేత భోజనంలా ఉంది. ఆ సినిమా చూశాక తమ ఆనందాన్ని ఎలా బయటకు చెప్పాలో తెలియక అభిమానులు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు.
అసలు ఆనందాన్ని తట్టుకోలేక కేరింతలు ఈలలు వారిని పట్టుకోలేం. బోయపాటి బాలయ్య అభిమానుల కోసమే పుట్టినట్టుంది ఈ సినిమాపై అభిమానుల టాక్ చూస్తుంటే. కథలు కాకరకాయలు అందరూ ఇస్తారు… రోమాలు నిక్కబొడుచుకునే యాక్షన్ మా బాలయ్యే ఇస్తారు అని అభిమానులు ఓ రేంజ్ లో చెప్పుకుంటున్నారు.
ఒక అభిమాని వీడియో చూస్తే మీరు ఫ్యాన్స్ అంటే ఏంటో అర్థం చేసుకుంటారు
రాంప్ ఆడించేశాడు
ఫ్యాన్స్ కి పునకాలే…
🦁🦁🦁 pic.twitter.com/3SlnOXNkEw— Mohammed Sharif (@tdpSharif) December 2, 2021
ఇక మరో అభిమాని సినిమా గురించి ఇలా రాశాడు..
సింహా చూసిన తర్వాత ఇంత కంటే మాస్ సినిమా రాదు బాబోయ్ అనుకున్న. సింహా కంటే మించుద్దా అనుకున్న లెజెండ్ సినిమా నా అంచనాలకు మించి సింహా కంటే పవర్ఫుల్ గా చూపించాడు లెజెండ్ లో సింహా లెజెండ్ ల అంచనాలను అందుకుంటాడా, బాలయ్య ని మళ్ళీ ఆ రేంజ్ లో చూపిస్తాడా అనుకున్న అన్నిటినీ మించి అఖండలో బాలయ్యను చూపించాడు