సమరసింహారెడ్డి సిన్మా వచ్చినంక..
ఇట్లాంటి సిన్మా యాడొచ్చదిలేబ్బా…
ఎవురూ తీయలేరు..
ఏమి బీ.గోపాలుబ్బా..
బాలక్రిష్ణ మాద్రి నటించే మొగోడే లేడుప్పా అనుకున్యా!
అప్పుడు నేను తొమ్మిదో తర్తి!
నరసింహనాయుడు వచ్చినాక..
నేనప్పుడు ఇంటరు చదువుతాన..
ఏముందిబ్బా సినిమా.. అనుకున్యా!
మల్ల అట్లాంటి సినిమా బాలయ్యకు పల్య.
దర్శకుడు మాట కరెక్టుగా ఇని..
యా సక్కా అయినా..
యా వొల్య అయినా కట్టుకునే హీరో బాలక్రిష్ణ.
అట్లాంటాయప్ప..
ఏంటేంటోయో తీసినాడు..
అన్నీ అర్థంపర్థంలేని సిన్మాలే.
ఎవురు చూసినా ఆ సినిమాలు చూసి నగేవారు.
అయ్యన్నీ పట్టించుకోల్య..
హిట్లు లేకున్యా..
అసలు ఏమీ పట్టించుకోల్య.
అదీ ఆయప్ప కత!
ఇంగ బాలయ్య పని అయిపోయినాది..
ఏం లాభముల్యా అన్యారు.
బాలయ్య మాటలకు…
చేతలకు ముడిపెట్నారు.
రాజకీయాల్లోకి వచ్చినా..
ఏం చేసినా ఆయన్ని కామెడీపీస్ చేసేశారు.
మగాలు మార్చి నగినారు..
ముఖం చూడలేమన్యారు..
ఊరకుంటేమేలన్యారు.
ఏదీ పట్టించుకోల్య..
అట్లనే నడుచ్చానే ఉండాడు.
ఆ నడక..
ఒక్కసారిగా *సింహ*ము పరుగైనాది.
అదే -సింహా-!
బోయపాటి-బాలయ్య తొలి సిన్మా
నేనప్పుడు టీవీ9లో పని సేచ్చాన!!
నవ్వినచోటే నాపచేను పండీయటం..
కంపల్లోనే పూలు పూయించడం…
మామూలు పనిగాదు!
ఏదో దైవేచ్ఛ ఈళ్లను కలిపినట్లనిపించినాది.
సింహా రెండుమాట్లు చూసినా.
అబ్బా..
ఎట్ల తీసినార్రా బోయపాటి అనుకున్యా!
బాలయ్యకు మంచి సినిమా పడితే
ఇట్ల ఇరగదీచ్చాడా అనిపిచ్చినాది.
మాస్ సిన్మా ఖలేజా ఏంటో అర్థమైనాది.
నిజ్జంగా
బాలయ్యను క్రీజ్‌లోకి తీసుకొచ్చిన
బోయపాటి *ఘనాపాటి* అనుకున్యా!
జగపతిబాబుకు జీవం పోసినాడు..
బాలయ్యను మరో మెట్టు ఎక్కించిన సిన్మా అది.
సిన్మా అంటే వినోదం..
కుర్చీలో కూచ్చునేట్లు చేయడం..
సిన్మా అంటే మనలోని ఉద్వేగాలన్నీ తెరపై సూపీడం..
ఇయ్యన్నీ బోయపాటి సిన్మాలో
చూసి ఆశ్చర్యపోయినా!
మళ్లా రొన్నాళ్లకు..
లెజెండ్ వచ్చినాది.
బొమ్మ హిట్.. బంపర్ హిట్!
బిబి3 అంటానే..
బాగుంటాదిలే అనుకున్యా!
నిన్న సిన్మా రిలీజైనాది..
అంతా మిక్సుడు టాక్..
ఏదీ అర్థం కాక..
ఈ పొద్దు పద్దన్నే సిన్మాకు పోయినా.
అమీరుపేటలోని బిగ్సినిమాస్లోకి పోతాంటే..
ఏందోబ్బా.. ఈ బోయపాటి..
డబులాక్షన్ తీసినాడంట..
ఈ కాలంలో..
మీమ్స్ తో గేమ్స్ ఆడే ఈ నయారోజుల్లో..
టెక్కీ యూత్‌కి నచ్చుతాదో లేదో అనుకున్యా.
హాల్లోకి అడుగుపెట్నాక..
మెల్లగా పదిమంది జనాలు గుంపయినారు.
బాలయ్య నిజజీవితంలో ఎట్లుంటాడు..
ఆయప్ప మింద చేసిన కిండెలు..
హిందూపురం ఎమ్మెల్యే…
ఆ రోజుల్లో నాన్నగారు స్పీచులు..
అన్నీ మర్చిపోయి..
అభిప్రాయలన్నీ పక్కనబెట్టి ..
గమ్మన కూచ్చున్యా!
అఖండ..
ఫస్ట్ ఫ్రేమ్‌లోనే సిన్మా ఏంటో అర్థమైనాది.
రైతుపాత్ర, ప్రగ్యాజైస్వాల్..
పెద్ద కుటుంబం..
కక్షలు, కార్పణ్యాలు అన్నీ ఉన్నాయి.
అయితే ఈ సిన్మాలో
దర్శకుడు బోయపాటి డీప్ థాట్లోకి వెళ్లాడు.
దైవ్యం, రాక్షసుడి మధ్య కొట్లాటను..
ఎంతో అద్భుతంగా తెరకెక్కించినాడు.
నా పక్కన ఆరుమంది అవలైగాళ్లు కూచ్చున్యారు..
ఫస్ట్ ఫ్రేమ్నుంచి నవ్వటానికే వచ్చినారు..
ఎక్కడ ఎలా ఉండాలో..
ఏ సీను ఎట్ల పండుతాదో..
బోయపాటికి మించిన ఘనాపాటీ లేడేమో అనుకునేంత
గొప్పగా సిన్మా తీసినాడీయప్ప!
జీవమున్నకథకు..
ఉదాత్తమైన పాత్రలు నిలబెట్టాయి.
ఈ గుంటూరాయప్ప..
ఎంత ప్రతిభావంతుడండీ బాబూ..
బాలయ్య వయసునూ..
రాం ప్రసాద్‌గారి కెమెరా టెక్నిక్‌తోనే కాదు..
తన యుక్తితోనో మాయమయ్యేట్లు చేసినాడు.
పోత పోసినట్లు..
ఉలితో రాయిని చెక్కినట్లు…
ఎంత హుందాగా సినిమాను నడిపాడో!
రాజమౌళి ఫిక్షన్‌తో కొడతాడు..
త్రివిక్రమ్ తెలివితో కొడతాడు..
బోయపాటి భుజ-యుక్తిబలంతో కొడతాడు..
అందుకే ఇంతటి *అఖండ*విజయం!
దైవత్వం, దుష్టశక్తి కలబడితే.. అఖండ!
మంచి, చెడుల మధ్య పోరాటమే.. అఖండ!
దైవత్వాన్నీ, సందేశాన్నీ, భారతీయతత్వాన్నీ..
అద్భుతంగా చూపించాడీయప్ప!
ఫస్టాఫ్ ఒక ఎత్తయితే..
అఖండ వచ్చిన తర్వాత..
ప్రతి సీనూ ఓ అద్భుతమే.
ఆధునికతను *అఖండ*కు జోడించి..
మనలోని ప్రశ్నలకు సమాధానాలిచ్చి..
ఒక క్వశ్చన్.. ఒక ఆన్సర్..
ఇలా సినిమాను నడిపిన తీరు అమోఘం..
అద్వితీయం.. అద్భుతం!
సినిమాలో హింస ఉందని గొణిగే కొందరు..
హాలీవుడ్లో కాల్చుకోని సచ్చాంటే
బాగా సూచ్చారు కదా..
మళ్ల అప్పుడు అనరే!
ఈ సిన్మాలో హింసను మాట్లాడేవాళ్లు..
ఆ హింసకు ముందు సీన్ ఏంటో చూస్తే..
అలా అనలేరు.
పార్టీలు మారినంత సులువుగా..
ఓటీటీలు వచ్చిన ఈ రోజుల్లో..
ఉచితంగా దొంగ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకునే..
తెలివైన ప్రేక్షకులున్న ఈ రోజుల్లో
ఇట్లా సిన్మా తియ్యడం కష్టం.
అర్దనిమిషం బోర్ అయితే..
స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్ చాట్ చేయటమో..\
ఇన్‌స్టాలో కొత్త అప్డేట్స్ చూడటమో చేసే
ఈ కాలం కుర్రోళ్లను
కుర్చీలకు నిలబెట్టడం మామూలు ఇషయం కాదు.
బాలయ్య లాంటి బోలానటుడ్ని…
2021లో తెలివైన ప్రేక్షకులకు(ఓటీటీ అడ్వాన్సు థాట్స్)
సిన్మా ఏంటో చూపించాడు బోయపాటి.
అఖండ సినిమాలో వాస్తవం ఏంటంటే..
సినిమాలో రౌద్రరసం ఎక్కువ.
అయితే.. ఫస్టాఫ్‌లోని
బ్యూటిఫుల్ సీన్లకూ ఫిదా అవ్వాల్సిందే.
రెండు గంటల నలభై ఐదు నిమిషాల సినిమాను
కుర్చీలకు అతుక్కోని..
ఏం జరుగుతుందో అనే ఆలోచనతో..
సినిమాను చూపించాడు.
గుప్పెడంత గుండె
పదుల మాట్లు గూస్బంప్స్ ఇచ్చి
మనల్ని నిలబెడుతుంది.
ఈ రోజుల్లో..
రవ్వంత కామెడీ లేకుండా(ఒక్క కల్లుసీన్ తప్ప)..
సినిమాను ఈ రోజుల్లో నడిపించే
మొగోడెవడూ లేడు అనుకునేవాళ్లకు..
బోయపాటే సమాధానం.
పసిబిడ్డలాంటి ప్యూర్ కథకు..
ప్రళయంలాంటి బాలయ్యను తోడుచేసుకుని..
వెండితెరపై బోయపాటి చేసిన శివతాండవం.. *అఖండ*!
ఏమి లేదు ఈ సిన్మాలో..
పెద్ద కుటుంబం ఉంది..
మంచి దంపతులున్నారు..
అమ్మ సెంటిమెంట్ ఉంది..
పాపే ఈ సినిమాకు ప్రాణం!
పసిపాపే పరమాత్ముడంటారు..
ఓ పసిపాపే ఈ సినిమాను నడిపించింది..
కాదు కాదు అఖండను నడిపించింది.
కోడగిత్తలు, చీనాచెట్లు..
ఫ్యాక్షనిస్టు ప్రేమ..
కలెక్టరమ్మ నటన..
పసిపాప మనసు..
వరదరాజులు దుష్టగుణం..
దేవుడిలా ఉండాలనే దుష్టుడి ఆరాటం..
అన్నింటికంటే…
దుష్ట శిక్షణకోసం అఖండ చేసే పోరాటం..
ఇలా..
ఈ సినిమాను ప్రతి సారీ ఒకరొచ్చి బరువు మోస్తారు.
కోడగిత్తలూ..
రుద్రాక్షలూ నటించిన చిత్రమిది.
బాలయ్య నటన..
శ్రీకాంత్ యాక్షన్.. పీక్స్!
*అఖండ*జ్యోతికి వెలుగునిచ్చిన మంచి తమన్!
తమన్.. బీజీఎమ్ నెవ్వర్ బిఫోర్.
బాలయ్యను ఎలా చూపించాలో..
ఎలాంటి డైలాగ్స్ రాయాలో..
బోయపాటికి తెల్సినంతగా ఎవరికీ తెల్దేమో అనిపిచ్చాంది!
దర్శకుడు ఎంత గొప్పవాడో
చాటిచెప్పే మాస్మరైజ్ సిన్మా ఇది.
మీలోని సమస్త మానసిక రోగాల్ని..
ఒమిక్రాన్ లాంటి భయాల్ని పక్కనబెట్టి చూస్తే..
*అఖండ*
మీ గుండెలో జ్ఞాన జ్యోతిని నింపుతుంది!
బాలయ్య ఓ పవర్ ప్యాక్!
బోయపాటి ఓ పవర్‌బ్యాంక్!
జై బాలయ్య…
జైజై బోయపాటి..
జైజైజై తెలుగు సిన్మా!
ఇట్లు
ఓ సినిమా ప్రేక్షకుడు
రాళ్లపల్లి రాజావలి