బాలీవుడ్ సీనియర్ నటి ఐశ్వర్యా రాయ్ వివాదాలకు చాలా దూరంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఇటు, మీడియాలో గాని అటు సోషల్ మీడియాలో గాని ఐశ్వర్యా రాయ్ ఏ వివాదాల్లో తల దూర్చినట్టుగా, ఒక వివాదాస్పద కామెంట్ చేసినట్టుగా దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఐశ్వర్యరాయ్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. అది కూడా తన సొంత కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఐశ్వర్యారాయ్ చేసిన పని సోషల్ మీడియాలో విమర్శలకు తావిచ్చింది.
తన కూతురు ఆరాధ్య పుట్టినరోజు సందర్భంగా ఆమెకు ఐశ్వర్యరాయ్ లిప్ కిస్ ఇచ్చిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో, ఐశ్వర్యరాయ్ పై నెటిజన్లు కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. కుమార్తె బుగ్గ మీద, నుదిటి మీదో కాకుండా ఇలా పెదవులపై లిప్ కిస్ ఇవ్వడం ఏమిటి అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మేడం మీరు ఇలా కూడా చేస్తారా అంటూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు. ఇలా కూతురికి లిప్ కిస్ ఇవ్వడం వింతగా ఉందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
అయితే, కూతురికి ప్రేమతో ముద్దు పెట్టడం కూడా తప్పేనా అంటూ మరికొందరు ఐశ్వర్యను వెనకేసుకొస్తున్నారు. తల్లీకూతుళ్ల మధ్య అనుబంధాన్ని, ప్రేమను ఆ కోణంలోనే చూడాలని, దానిని ఇలా ప్రశ్నించాల్సిన అవసరం లేదని కొందరు ఐశ్వర్యకు బాసటగా నిలుస్తున్నారు. ఏది ఏమైనా ఐశ్వర్యరాయ్ ఈ లిప్ కిస్ ఫోటోను షేర్ చేసి విమర్శలు పాలైందన్న వాదనలు వినిపిస్తున్నాయి.