• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

`ఏఐ` ఎంత ప్రాణాంత‌క‌మో చెప్పిన బ్రిట‌న్ ప్ర‌ధాని స‌ల‌హాదారు!

admin by admin
June 7, 2023
in Around The World, Trending
0
0
SHARES
128
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఇటీవ‌ల కాలంలో ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ‌కు వ‌చ్చిన‌, వ‌స్తున్న అంశం కృత్రిమ మేథను(Ai). అయితే, దీనివ‌ల్ల ఒన‌గూరే మేలు క‌న్నా కూడా దీనిని నియంత్రించకుంటే వచ్చే రెండేళ్లలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంతర్జాతీయ నిపుణులు, టెక్‌ దిగ్గజ అధినేతలు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఇవి అనేక మందిని చంపే శక్తిమంతమైన ఆయుధాలను ఉత్పత్తి చేయ డంలో దోహదపడతాయని బ్రిటన్‌ ప్రధాని సలహాదారుడు మ్యాట్‌ క్లిఫర్డ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

‘ఎన్నో ప్రాణాలు తీయగల సైబర్‌, బయోలాజికల్‌ ఆయుధాలను సృష్టించే సామర్థ్యం కృత్రిమ మేధకు ఉంది. దీన్ని నియంత్రించకుంటే.. మానవుడు నియంత్రించలేని శక్తివంతమైన వ్యవస్థ ఏర్పాటుకు దారితీస్తాయి. ఏఐతో స్వల్ప, దీర్ఘకాలికంగా ఎన్నో రకాల ముప్పులు పొంచివున్నాయి. జీవాయుధాలు లేదా భారీ సైబర్‌ దాడులను చేసేందుకు అవసరమైన సాంకేతికత కోసం ఏఐను ఇప్పుడు వాడుకోవచ్చు. ఇవన్నీ చాలా ప్రమాదకరమైనవి’ అని మ్యాట్‌ క్లిఫర్డ్‌ హెచ్చరించారు.

బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ సాంకేతిక సలహాదారుగా వ్యవహరిస్తున్న క్లిఫర్డ్‌.. చాట్‌ జీపీటీ, గూగుల్‌ బార్డ్‌ వంటి కృత్రిమ మేధ మోడల్స్‌పై పరిశోధన కోసం ఏర్పాటు చేసిన ఫౌండేషన్‌ మోడల్‌ టాస్క్‌ఫోర్స్‌కు నేతృత్వం వహిస్తున్నారు. అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ ఇన్వెన్షన్‌ ఏజెన్సీ ఛైర్మన్‌గానూ ఉన్నారు. ఇదిలావుంటే, చాట్‌జీపీటీ వంటివి యావత్‌ మానవాళికి తీవ్ర ముప్పును తలపెట్టే ప్రమాదం ఉందని అంతర్జాతీయ టెక్‌ దిగ్గజ సంస్థల అధిపతులు కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ తరహా వ్యవస్థల అభివృద్ధిని నియంత్రించాల్సిన అవసరం ఉందని కోరుతూ అనేక మంది నిపుణులు బహిరంగ లేఖ రాశారు. అందులో ఎలాన్‌ మస్క్ కూడా సంతకాలు చేశారు. దీన్ని సరైన విధంగా వినియోగించకుంటే హానికరమైన పరిణామాలు తప్పవని అటు గూగుల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సుందర్‌ పిచాయ్ హెచ్చరించారు. కృత్రిమ మేధ దుష్ర్పభావాలను తలచుకుంటే నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని పిచాయ్ గ‌తంలో చెప్పిన‌ప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మైన విష‌యం తెలిసిందే.

Tags: aibritainlife threateningshocking fact
Previous Post

‘బాలయ్య’ బర్త్ డే న్యూ యార్క్ టైం స్క్వేర్ లో!

Next Post

కాంగ్రెస్ కు ఊహించని షాక్!

Related Posts

nara bhuvaneswari with lokesh
Andhra

భువనేశ్వరి మనోబలం… పార్టీలో ఆశ్చర్యం!

October 1, 2023
nara bramhani with janasena
Andhra

నారా బ్రాహ్మణి… వైసీపీ కొత్త భయం !!

October 1, 2023
jagan thinks about kamma
Andhra

జగన్ ఊహించని రెండు పరిణామాలు

October 1, 2023
KCR
Telangana

కేసీఆర్ కి ఇది పెద్ద షాకే!

October 1, 2023
Around The World

రెండు దశాబ్దాలు..!మృత్యుంజయుడై నిలిచిన చంద్రబాబు!!

October 1, 2023
Around The World

Political Analysis: వై నాట్‌ టీడీపీ-జనసేన కూటమి?

September 30, 2023
Load More
Next Post
ashok gehlot

కాంగ్రెస్ కు ఊహించని షాక్!

Latest News

  • భువనేశ్వరి మనోబలం… పార్టీలో ఆశ్చర్యం!
  • నారా బ్రాహ్మణి… వైసీపీ కొత్త భయం !!
  • జగన్ ఊహించని రెండు పరిణామాలు
  • కేసీఆర్ కి ఇది పెద్ద షాకే!
  • రెండు దశాబ్దాలు..!మృత్యుంజయుడై నిలిచిన చంద్రబాబు!!
  • మంచు విష్ణు.. నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్
  • ‘హుకూం’ పాట అసలు లేనే లేదట
  • ఆ 10 సీట్ల కోసమే కేటీఆర్ ఎన్టీఆర్ జపం ?
  • ఆ నినాదంతో ఉద్య‌మిస్తాం అంటోన్న బాల‌కృష్ణ
  • Political Analysis: వై నాట్‌ టీడీపీ-జనసేన కూటమి?
  • చంద్రబాబు అరెస్ట్..జగన్ కు నటుడు రవిబాబు రిక్వెస్ట్
  • అక్టోబర్ 2న నారా భువనేశ్వరి నిరాహార దీక్ష
  • 41ఏ నోటీసులు అందుకున్న లోకేష్..4న విచారణ
  • జగన్ భుజంపై ‘బీజేపీ అనకొండ’ కోరల్లో చంద్రబాబు
  • చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల సస్పెండ్

Most Read

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

కమ్మ కులం పూజారి జగన్ !

సుప్రీం కోర్టులో చంద్రబాబు కు చుక్కెదురు

ఆర్కే కొత్తపలుకులో ఈ కీలక పాయింట్లు గమనించారా?

చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్

సాయిరెడ్డికి షాక్.. చంద్రబాబు కు మద్దతుగా టీడీపీలోకి వైసీపీ నేతలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra