ఇది సినిమాల్లో తప్ప నిజ జీవితంలో సాధ్యం కాదు అనుకుంటాం. కానీ సినిమాల్లో కూడా అంత నమ్మశక్యంగా అనిపించని సంఘటన నిజ జీవితంలో జరిగింది. మధ్య ప్రదేశ్ లో తన భర్తకు అతని ప్రియురాలితో పెళ్లి చేసిన భార్య కథ ఇది. ఇపుడు ఆమె దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో జరిగిన ఈ సంఘటన ఇపుడు పెద్ద చర్చనీయాంశం. భోపాల్ కు చెందిన ఓ జంటకు మూడేళ్ల క్రితం పెళ్లయ్యింది. కానీ పెళ్లయినప్పటి నుంచి భర్త వేరే అమ్మాయి ధ్యాసలో ఉన్నాడు. ఎందుకలా ఉన్నావని ఆరా తీసింది. భర్త నిజం చెప్పాడు. అయితే, నాకు నువ్వు కూడా ఇష్టమే. ఆమెతో పాటు మనం ముగ్గురం కలిసి ఉందాం అన్నాడు.
అయితే, మనం అలా చేస్తే చట్టం ఒప్పుకోదు అని చెప్పిన భార్య … నువ్వు బాధపడకు, నీకు నచ్చిన అమ్మాయితో నేనే పెళ్లి చేయిస్తాను. ఎవరూ ఏమీ అనకుండా నీకు నేను విడాకులు ఇస్తాను అని చెప్పింది. అనడమే కాదు, తాను విడాకులు ఇచ్చేసింది. అతని ప్రియురాలితో భర్తకు ఘనంగా పెళ్లి చేసింది.
లాయర్ ఆమె గురించి మాట్లాడుతూ ఏమన్నాడో తెలుసా?.. ఆమె ఆలోచన ఉన్నతమైనది. బాగా ఆలోచించి, మంచి నిర్ణయం తీసుకుంది అని చెప్పారు. ఆమె చేసిన పనికి కొందరు ఆశ్చర్యపోతుండగా… అలాంటి భార్యను దూరం చేసుకుని వాడేం సుఖపడతారని కొందరు అంటున్నారు.