కేసీఆర్ ని ఎన్ని విషయాల్లో విమర్శించినా… పచ్చదనం పెంచడంలో, గ్రీన్ రెవల్యూషన్లో మాత్రం కచ్చితంగా అభినందించాల్సిందే. తెలుగుదేశం ప్రభుత్వంలో 1999లో జన్మభూమిలో అడవుల విస్తరణ అనే కాన్సెప్టును బలంగా చేపట్టారు. ఆ కార్యక్రమాన్ని అప్పట్లో కేసీఆర్ పర్యవేక్షించారు. అందుకే అప్పటి నుంచి కేసీఆర్ కు అడవులు అంటే ప్రత్యేక అవగాహన, పర్యావరణం అంటే ప్రత్యేక అభిమానం ఏర్పడ్డాయి.
కేసీఆర్ కచ్చితంగా దృష్టిపెట్టే అంశం ఏదైనా ఉందంటే అది ఇదే. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత నుంచి హరిత హారం అనే కార్యక్రమం ద్వారా అనేక కోణాల్లో పచ్చదనం పెంపునకు తెలంగాణ సర్కారు చేస్తున్న కృషిని దేశమే కాదు, ప్రపంచం కూడా గుర్తిస్తోంది.
అడవుల పెంపకంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిపింది. అడవుల పెంపకంలో తెలంగాణ ఇతర రాష్ట్రాల కంటే చాలా ముందుందని కేంద్ర పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రి బాబుల్ సుప్రియో స్వయంగా రాజ్యసభలో తెలియజేశారు.
కాంగ్రెస్ ఎంపి జిసి చంద్రశేఖర్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, 2019-20లో నాటిన చెట్ల వాస్తవ సంఖ్య గురించి రాష్ట్రాల వారీగా వివరాలు అడిగారు. చార్టులో తదుపరి రాష్ట్రం 3454.71 లక్షల మొక్కలు నాటిన మధ్యప్రదేశ్, 2259.86 లక్షల తోటలతో ఉత్తర ప్రదేశ్.
చంద్రబాబు హయాంలో పలుమార్లు ఏపీ టాప్ లో ఉండేది. జగన్ వచ్చాక చెట్లను పెంచడం పక్కన పెడితే మడ అడవులను ఇళ్ల స్థలాల కోసం, ఇతర అడవులను మైనింగ్ కోసం తుంచేస్తున్నారు. దీంతో ఒకవైపు ఏపీలో పర్యావరణం దెబ్బతింటుంటే తెలంగాణలో విస్తరిస్తోంది.
కేంద్ర రికార్డుల ప్రకారం మొత్తం జాతీయ చెట్ల నాటే లక్ష్యం 150.23 కోట్ల మొక్కలు అయితే ఒక్క తెలంగాణ మాత్రమే 38.17 కోట్ల మొక్కలను నాటినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2014 నుండి కేవలం ఆరు సంవత్సరాలలో రాష్ట్ర హోదాను సాధించిన తర్వాత గ్రీన్ కవర్ను నాలుగు శాతం పెంచగలిగింది. జాతీయ సాధనలో తెలంగాణ వాటా 25 శాతానికి పైగా ఉంది!
2015 లో, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అడవులను పునరుజ్జీవింపజేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్రంలో 24 శాతం నుండి 33 శాతానికి అడవులను పెంచే లక్ష్యంతో తెలంగాణ కు హరిత హారాన్ని ప్రారంభించారు. అప్పటి నుండి, ఈ కార్యక్రమం ప్రతి వర్షాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా అమలు చేయబడుతుంది.
Hurrah!
Indian ???????? state of Telengana is world leader in aforrestation. Rapid increase in green cover in the state. Impressive urban parks. Huge benefits for wildlife and nature. A better environment for people. Impressive! pic.twitter.com/BM1TQr1joN— Erik Solheim (@ErikSolheim) August 17, 2021