ఈ అడివి రెడ్డి అంతులేని పాపం పండింది – ఇన్నాళ్లకు
అడ్డంగా దొరికాడు, అడవి మృగానికి మించి
అడవిలో స్వైర విహారం చేసి, ప్రభుత్వ సొమ్ములతో
రహదారులు వేసుకొని మురిసిపోయిన
ఈ పాపాల పెద్దిరెడ్డి ప్యాలస్ చూడండి
ఇక ఈయన నిజ జీవిత రాజకీయ కిరాతక కథలు
ఈయన చదివిన వెంకటేశ్వరా యూనివర్శిటీలో పీహెచ్డీ సబ్జెక్ట్ అంత
బయటకి చాలా సౌమ్యంగా కనిపిస్తాడు
కానీ పుంగునూరులో ఈయన అంటే గజ గజ
పాలు ఈయన శివశక్తి డైరీకి 18 రూపాయలకే పొయ్యాలి
వేరే లారీ వస్తే టైరులు కాల్చేస్తారు
మామిడి కాయలు ఈయన చెప్పిన మండీలకి తోలాలి
పేదల కష్టాన్ని దోచుకొన్నాడు దశాబ్దాలపాటు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏంది పాదయాత్ర చేసేది
నేను కూడా పాదయాత్ర చేస్తా సిఎం అవుతా అని
పోటీగా పాదయాత్ర చేసి అప్పటి కాంగ్రెస్స్ హై కమాండ్‌తో
చివాట్లు తిని మూసుకొన్నాడు
దానిని మనసులో పెట్టుకొని వైఎస్ రాజశేఖర్ రెడ్డి
రాజకీయంగా అణగద్రొక్కాడు పెద్దిరెడ్డిని
తనకన్నా చిన్న వయసు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
పార్టీలో సమకాళీకులు వైఎస్సార్, చంద్రబాబు సీఎంలు అయ్యారు
తాను అవ్వాలి అని తహతహలాడిపోయాడు
నా కాళ్లు పట్టుకొన్నాడు పెద్దిరెడ్డి అని ఇటీవల
నల్లారి కిరణ కుమార్ రెడ్డి బహిరంగంగా సవాల్ చేసి చెప్పాడు
రాత్రి తాగేసి పట్టుకొన్నా అనుకొంటావు
తెల్లారాక కూడా పట్టుకొంటా అని వచ్చాడు
కాదని చెప్పగలవా అని
అలా తన కొడుకును జగన్‌తో స్నేహం చెయ్యించి
సమకాళీకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు దగ్గర
ఊడిగానికి దిగి జగన్‌ను మెప్పించాడు
అధికారంలోకి రాగానే..
ఈయన మంత్రిగా ప్రమాణస్వీకారం చెయ్యగానే
జగన్‌ను సీబీఐ కేసుల్లో లోపలేస్తారు
ఆయనతో పాటు భారతిని కూడా బొక్కలో వేస్తారు
పెద్దిరెడ్డి సిఎం అవుతారు అని
ఆయన ఇలాకా పుంగునూరు, చిత్తూరుల నుండి
కడపలో బద్వేల్ వరకు వైకాపాలోనే చెప్పుకొనేవారు
అలా ఆయన అనుచరులు ప్రచారం చేసేవారు
మంత్రిగా విజృంభించాడు
వందలాది ట్రిప్పర్లు దింపాడు
ఇసుక నుండి రాళ్ల క్వారీల వరకు కొల్లగొట్టాడు
వందలాది మైన్స్ మీద ఆధిపత్యం
స్థానిక ఎన్నికల నుండి పార్లమెంటు ఉప ఎన్నికల వరకు
రంగంలోకి దిగితే.. అటు క్రిష్ణగిరి తమిళులు వచ్చి కుప్పంలో ఓట్లేస్తారు
ఇటు తిరుపతిలో పాస్‌పోర్టులకు అని చెప్పి, దర్శనాలకు అని చెప్పి
కడప నుండి బస్సులు పెట్టి దొంగ ఓట్లు వేయిస్తాడు
ఏకంగా దొంగ ఓట్లనే వేలల్లో నమోదు చెయ్యిస్తాడు
జగన్ ప్రశంసలతో మరింత రెచ్చిపోయాడు
పార్టీలో కూడా ఎక్కడ ఎన్నికలు జరిగినా
ఈయనే పార్టీకి దిక్కు – పుడింగు అనే
ఆధిపత్యాన్ని సంపాయించాడు
అక్కడి నుండి మరింత ముదిరిపోయాడు
తాను సిఎం అయ్యే యోగం లేదని నీలాంబరి లెక్కన మారాడు
మాజీ జడ్జీల మీదే దాడులు చెయ్యించి
కేసులు పెట్టగల స్థాయి నించి
చంద్రబాబును పుంగునూరుకు రాకుండా
అంగళ్ల వద్దే అడ్డగించి
ఆయన మీదే హత్యాయత్నం కేసులు పెట్టించే
కండకావరానికి దిగాడు
అదేముంది కుప్పంలో అన్నక్యాంటీన్ పెడుతుంటే
అడ్డుకొని వందలాది మంది కార్యకర్తల మీద
ఆట్రాసిటీ కేసులు పెట్టించాడు
పుంగునూరులో టిడిపి కార్యకర్తల మీద కేసులే కాదు
కాళ్లూ చేతులు విరిచేయించడం
బయట నుండి వచ్చినా బడిత పూజ చెయ్యించే
ఆటవిక రాజ్యంగా మార్చాడు
మదనపల్లి చుట్టుప్రక్కల వందలాది ఎకరాలు
పీలేరు సదుం సోమల తంబళపల్లి అంతా
అసైండ్ ల్యాండ్ల సెటిల్మెంట్లు
సొంత కులం గింతకులం అని చూడలేదు
ఒక అడవి ముళ్ల పంది లెక్కన స్వైరవిహారం చేశాడు
సినిమాల్లో కూడా చూసి వుండరు
పుంగునూరు జనం
వణికిపోయేవారు
దాదాపూ ఓడిపోయేవాడు
ఇంకో వ్యక్తి వచ్చి ఓట్లు చీల్చకపోతే
ఓడంగానే పుంగునూరులో జనం, రైతులు తిరగబడ్డారు
అయినా తగ్గకుండా కొడుకును పంపి రౌడీయిజం చేశాడు
కోర్టులకు వెళ్లాడు
మదనపల్లి ఫైల్స్ విషయంలో
ముదస్తు బెయిల్ తెచ్చుకొన్నారు
తిరుపతిలో దారులు కూడా అక్రమించి
ఎన్నికల ఫలితాల తరువాత కూడా
నాదే అది అని చెప్పడం మనకు తెలిసిందే
ఫలితాలు వచ్చాక ఇన్నాళ్లకు పాపం పండింది
అడవిని చెరపట్టి
అసైండ్ ల్యాండ్స్ ఆక్రమించి
జాగీరన్నట్లు వెయ్యించుకొన్న
రోడ్డు, బంగళాతో సహా..
అడ్డంగా దొరికిపోయాడు
ప్రభుత్వం ఆఘమేఘాల మీద ఆదేశాలు ఇచ్చింది
చర్యలు మొదలెట్టబోతోంది
ఈపాటికి ముందస్తు బెయిల్‌కు సిద్ధం చేసుకొన్నా
కోర్టులు కూడా ఈసారి కాపాడకపోవచ్చు
జనం కూడా కసిగా వున్నారు
విసిగిపోయిన వున్నారు
ఎన్నాళ్లు చెబుతారు కథలు
ఏ చర్యలూ చేపట్టకుండా అని
ఇలాంటి ఆటవీకులు ప్రజాస్వామ్యానికి
ఎప్పుడూ పెను ముప్పే.