వైసీపీ మంత్రి, విద్యావంతుడు, కేంద్ర మాజీ ఉద్యోగి ఆదిమూలపు సురేష్.. తాజాగా యర్రగొండపాలెంలో టీడీపీ అదినేత చంద్రబాబు పర్యటనను అడ్డుకునే క్రమంలో అనూహ్యంగా ప్రవర్తించారు.
టీడీపీ నేతలు తనను ఏదో తిట్టారని పేర్కొంటూ, ఆయన ఏకంగా నడిరోడ్డుపై చొక్కా విప్పేశారు.
నిజానికి ఆయనేమీ సాధారణ కార్యకర్తకాదు.
పార్టీలో మామూలు నేత, మామూలు ఎమ్మెల్యే కూడా కాదు, మంత్రి, పైగా రెండోసారికూడా వరుసగా ఆయనకు అవకాశం ఇచ్చారు.
అలాంటి గౌరవ ప్రదమైన స్థానంలో ఉన్న మంత్రి సంయమనం కోల్పోయారనే వాదన వినిపిస్తోంది.
పైగా చొక్కావిప్పేసి అరగంటకు పైగా అలానే ఉండిపోయారు. అలానే మీడియాతోనూ మాట్లాడారు.
టీడీపీ నేతలకు ఆయన సవాళ్లు కూడా రువ్వారు.
రాజకీయంగా ఈ పరిణామం.. 24 గంటలు గడిచినా.. ఇంకా చల్లారలేదు.
పైగా.. మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. దీ
నిని కేంద్రం స్థాయికి తీసుకువెళ్లి తాడోపేడో తేల్చుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబురెడీ అవుతున్నారు.
ఇదిలావుంటే.. ఈ పరిణామాలపై నెటిజన్లు ఆసక్తిగా రియాక్ట్ అవుతున్నారు.
`వైసీపీలో అంతా విప్పే నేతలే తప్ప.. ఎవరున్నారు?` అంటూ కామెంట్లు చేస్తున్నారు.
గతంలో హిందూపురం ఎంపీ మాధవ్.. ఓ న్యూడ్ కాల్ చేశారు.
ఆయన ఫ్యాంటు విప్పి చూపించారు.
ఇప్పుడు మంత్రి ఆది మూలపు సురేష్ చొక్కావిప్పి చూపించారు.
వైసీపీ నేతలు ఇంతే. ఏమీ దాచుకోరు“ అని మరికొందరు నెటిజన్లు వ్యాఖ్యలు చేశారు.
విప్పేయడం.. వైసీపీ నైజం.
ఏపీకి రాజధాని లేకుండా.. పరువును విప్పేశారు.
ఏపీలో ఉద్యోగాలు లేకుండా.. పెట్టబడులు రాకుండా.. చేసేశారు.
ఇప్పుడు బట్టలిప్పుకుని చూపిస్తున్నారు.. ఓట్లు వేసినందుకు.. అనుభవించండి.. చూసి తరించండి“ అని ఒక ఎన్నారై.. వ్యాఖ్యానించారు.
“వైసీపీ నేతలు ఏమీ దాచుకోరు.
వారికి తెలిసింది దోచుకోవడమే.
గతంలో ఎంపీ చూపించినప్పుడు జగన్ వెనుకేసుకు వచ్చారు.
ఇప్పుడు మంత్రి చూపిస్తే.. మాత్రం వద్దంటారా? అందుకే చూపించారు“ అని మరికొందరు వ్యాఖ్యానించారు
మొత్తంగా మంత్రి ఆదిమూలపు వ్యవహారంపై నెటిజన్లు ఆసక్తిగా స్పందించడం గమనార్హం.