గడిచిన కొద్ది రోజులుగా దూసుకెళుతున్న సెన్సెక్స్ ఈ రోజు (సోమవారం) భారీ నష్టాల్లోకి జారుకుంది. ప్రపంచ మార్కెట్ల సంకేతాలతో ట్రేడింగ్ ప్రారంభమైన కాసేపటికే బలహీనంగా ఉన్న సూచీలు మరింత పతనాన్ని నమోదు చేశాయి.
తాజా నష్టాల్లో పెద్ద ఎత్తున నష్టపోయింది మాత్రం అదానీ స్టాక్ గా చెప్పాలి. ఒకదశలో సెన్సెక్స్ 524 పాయిట్లు కోల్పోతే.. నిఫ్టీ 188 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసింది. తాజా పరిణామాలతో సెన్సెక్స్ 52వేల దిగునకు చేరుకుంది.
ఈ రోజు మార్కెట్ లో నష్టపోయిన షేర్లలో అదానీ ఎంటర్ ప్రైజెస్.. అదానీ పవర్.. అదానీ పోర్ట్స్.. అదానీ ట్రాన్స్ మిషన్ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. వీటితో పాటు లోహాలు.. ఫైనాన్షియల్.. ఆటో.. రియాల్టీకి చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా అదానీ షేర్లు నష్టపోవటంపై షాక్ కు గురవుతున్న కొందరు.. ఈ మధ్యనే ప్రముఖ బ్లూమ్ బర్గ్ మీడియా సంస్థ పబ్లిష్ చేసిన సంచలన కథనాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
అదానీ కంపెనీ షేర్లు పెరిగిన తీరుపై విస్మయం వ్యక్తం చేయటంతోపాటు.. ఆరోగ్యకరంగా వాటి ఎదుగుదల లేదన్న విశ్లేషణను చేసింది. ఆ మీడియా సంస్థకు చెందిన నిఘా విశ్లేషకులైన గౌరవ్ పట్నాకర్.. నితిన్ చందూకలు ఈ షేర్ల భవిష్యత్తు ముప్పుగా హెచ్చరించారు.
ఈ కంపెనీల్లో విదేశాలకుచెందిన కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టినట్లుగా పేర్కొన్నారు. మారిషస్ కు చెందిన కొన్ని కంపెనీలు ఇందులో భారీగా పెట్టుబడులు పెట్టటంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. ఆన్ షోర్ ఓనర్ షిప్ తగ్గటంపై అన్నది రిస్క్ తో కూడుకున్నదిగా విశ్లేషించారు.
ఈ కథనాన్ని కోట్ చేస్తూ.. దేశీయ ప్రముఖ మీడియా సంస్థ అయిన ఎకనామిక్స్ టైమ్స్ కూడా ఒక కథనాన్ని పబ్లిష్ చేసింది. ఆయన కంపెనీలు రాకెట్ కంటే స్పీడ్ గా పెరిగాయని.. అత్యంత వేగంగా ఆసియాలో రెండో సంపన్నుడిగా ఆయన ఎదిగారని.. అందుకు ఆయన షేర్ల ధరలే కీలకభూమిక పోషించటం గమనార్హం.