సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్ల జాబితాలో చెన్నై సోయగం త్రిష ఒకరు. తెలుగు మరియు తమిళ ప్రేక్షకులకు త్రిష అత్యంత సుప్రసిద్ధురాలు. సుదీర్ఘకాలం నుంచి అగ్ర తారగా సత్తా చాటుతున్న త్రిష.. ఇటీవల కాలంలో కెరీర్ పరంగా మరింత జోరు చూపిస్తోంది. సీనియర్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ గా మారింది. ఈ సంగతి పక్కన పెడితే.. తాజాగా త్రిష కు సంబంధించి ఓ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది. గతంలో ఈ ముద్దుగుమ్మ ఓ హీరో పెళ్లిని అన్యాయంగా చెడగొట్టాలని చూసిందట. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు శ్రీరామ్.
మోడల్ గా కెరియర్ ప్రారంభించిన శ్రీరామ్ ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాడు. తెలుగు ,తమిళ భాషల్లో అనేక చిత్రాలు చేశాడు. హీరో గానే కాకుండా సహాయక నటుడిగా, ప్రతినాయకుడిగా కూడా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. గత ఏడాది చివర్లో పిండం మూవీతో అందరినీ భయపెట్టి డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఇకపోతే 2008లో శ్రీరామ్ ఓ ఇంటివాడు అయ్యాడు. ఆస్ట్రేలియాలో ఎంబీఏ పూర్తి చేసిన వందన అనే అమ్మాయిని అతను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు.
అయితే శ్రీరామ్, వందన వివాహాన్ని త్రిష చెడగొట్టాలని చూసిందట. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రీరామ్ స్వయంగా రివీల్ చేశాడు. మనసెల్లాం, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే వంటి చిత్రాల్లో శ్రీరామ్, త్రిష స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆయా సినిమాలు ద్వారా శ్రీరామ్, త్రిష మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ తరుణంలోనే శ్రీరామ్ కు వందనాతో మ్యారేజ్ సెట్ అయింది. వందన త్రిషకు అంతకుముందే తెలుసు. ఇద్దరు స్నేహితులు.
దాంతో వందనకు శ్రీకాంత్ పై త్రిష బ్యాడ్ గా చెప్పిందట. శ్రీకాంత్ మంచివాడు కాదని, ఇంగ్లీష్ మాట్లాడడం రాదని, అతన్ని పెళ్లి చేసుకుంటే లైఫ్ స్పాయిల్ అవుతుందని చెప్పిందట. కానీ వందనం త్రిష మాటలను పట్టించుకోలేదు. శ్రీరామ్ వద్దకు వచ్చి త్రిష ఇలా నీ గురించి చెబుతుందని మొత్తం వివరించిందట. దాంతో షాకైన శ్రీరామ్.. త్రిష దగ్గరికి వెళ్లి ఎందుకు ఇలా చేశావంటూ నిలదీశాడట. కానీ త్రిష మాత్రం చాలా కూల్ గా `పాపం రా వందన.. నా ఫ్రెండ్.. నీలాంటోడికి ఎలా రా ఇచ్చేది..` అంటూ నవ్వేసిందట. త్రిష ఫన్ కోసమే చేసినా.. మ్యాటర్ సీరియస్ అయ్యుంటే మాత్రం పరిస్థితులు మరోలా ఉండేయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.