సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినప్పటికి హీరోయిన్ కు ఉండే గ్లామర్ ఇమేజ్ సొంతమైనోళ్లు చాలా కొద్దిమందే ఉంటారు. ఆ కోవలోకే వస్తారు నటి సురేఖ వాణి. కాలం గడుస్తున్న కొద్దీ మరింత యంగ్ గా కనిపించే సురేఖ.. ఇటీవల కాలంలో సినిమాలకు దూరంగా ఉంటున్నా.. సోషల్ మీడియాలో ఆమె చేసే సందడి పుణ్యమా అని ఆమె అభిమానులకు మరింత దగ్గర అవుతుంది. కూతురు సుప్రితతో ఆమె చేసే హడావుడి అంతా ఇంతా కాదు. మోడ్రన్ డ్రెస్సులతో కూతురితో పోటీ పడే ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కూతురితో ఆమె తీసుకునే ఫోటోలు.. వీడియోల్ని చూస్తే.. అక్కాచెల్లెళ్ల మాదిరి కనిపిస్తారే కానీ.. అమ్మాకూతుళ్లు అన్నట్లుగా ఉండరు. బెస్ట్ ఫ్రెండ్స్ లెక్కన ఉండే వీరిద్దరి వీడియోలు విపరీతమైన ఆదరణను సొంతం చేసుకుంటూ ఉంటాయి. ఆ మధ్యన సురేఖ వాణి భర్త అకాల మరణం చెందటం.. కొద్ది కాలం తర్వాత నుంచి రెండో పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురుకావటం తెలిసిందే.
రెండో పెళ్లిపై సురేఖ వాణి మౌనంగా ఉన్నప్పటికీ.. ఆమె కూతురు మాత్రం తన తల్లికి రెండో పెళ్లి చేస్తానంటూ చెప్పే మాటలు అందరిని ఆకర్షిస్తూ ఉండటమే కాదు.. తల్లుల గురించి ఆలోచించే ఇలాంటి కూతుళ్లు అందరికి ఉండాలన్న భావన కలిగేలా చేస్తుంది. రెండో పెళ్లి మీద ఎదురయ్యే ప్రశ్నలకు.. తనకు అలాంటి ఆలోచన లేదనే సురేఖ వాణి సమాధానాలకు భిన్నంగా ఈసారి ఆమె భిన్నమైన వ్యాఖ్య చేశారు.
తాజాగా ఒక యూట్యూబ్ చానల్ తో మాట్లాడిన సందర్భంగా పెళ్లి మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేయటంతో ఆమె వార్తల్లోకి వచ్చారు. తనకు రెండో పెళ్లి మీద ఆసక్తి లేదని.. కానీ తన కుమార్తె సుప్రీతా తనను మళ్లీ పెళ్లి చేసుకోవాలని చెబుతున్నట్లు చెప్పారు. ఇప్పుడు ఆ ఆలోచన లేదు కానీ భవిష్యత్తులో ఏమైనా చేసుకుంటానేమో చూడాలన్నారు. నచ్చిన వ్యక్తి దొరకలేదని.. ప్రస్తుతానికి ఎవరూ లేరన్న ఆమె.. తనకు బాయ్ ఫ్రెండ్ కావాలనిపిస్తోందంటూ అందరిని సర్ ప్రైజ్ చేశారు.
‘‘మంచి హైట్ ఉండాలి. పర్సనాలిటీ ఉన్న వ్యక్తి బాయ్ ఫ్రెండ్ గా కావాలి. లైట్ గా గడ్డం ఉండాలి. అతనికి బాగా డబ్బులు ఉండాలి. ముఖ్యంగా నన్ను అర్థం చేసుకోవాలి. అలాంటి వ్యక్తి దొరికి.. నాకు నచ్చితే అతడినే పెళ్లి చేసుకుంటా’’ అంటూ చేసిన వ్యాఖ్యలతో సురేఖా వాణి వార్తల్లోకి వచ్చేశారు. మరి.. ఆమె ఓపెన్ అయిన విష్ లిస్టులో మాదిరి బాయ్ ఫ్రెండ్ ఆమెకు ఎప్పటికి లభిస్తాడో చూడాలి.