ప్రముఖ నటి ప్రణీత సుభాష్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కన్నడలో స్టార్ హీరోయిన్ అయిన ఈ బ్యూటీ.. తెలుగు, హిందీ, తమిళ ప్రేక్షకులకు కూడా అత్యంత సుప్రసిద్ధురాలు. తెలుగులో ఏం పిల్లో.. ఏం పిల్లడో, బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస తదితర చిత్రాల్లో నటించి పాపులర్ అయిన ప్రణీత.. తాజాగా తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఓ గుడ్న్యూస్ చెప్పి ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేసింది.
తాను త్వరలోనే రెండోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. 2021లో వ్యాపారవేత్త నితిన్ రాజును ప్రణీత వివాహం చేసుకుంది. కరోనా మహమ్మారి కారణంగా గప్చుప్ గా బెంగళూరులోని ఒక రిసార్ట్ లో పెళ్లి తంతును కానిచ్చేశారు. వివాహం అయిన కొంత కాలానికే గర్భం దాల్చిన ప్రణీత.. 2022 జూన్ లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
అయితే ఇప్పుడు నితిన్ రాజు-ప్రణీత దంపతులు తమ సెకండ్ చైల్డ్ కు వెల్కమ్ చెప్పేందుకు రెడీ అయ్యారు. రెండో సారి ప్రగ్నెంట్ అయినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రణీత కన్ఫార్మ్ చేసింది. ఈ మేరకు బేబీ బంప్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్న ఆమె.. `రౌండ్ 2 నా ప్యాంట్స్ ఇప్పుడు సరిపోవట్లేదు` అంటూ ఫన్నీగా క్యాప్షన్ ఇచ్చింది. దీంతో నెటిజన్లు ప్రణీతకు కంగ్రాట్స్ చెబుతున్నారు.
View this post on Instagram