నటుడు సత్యరాజ్ అంటే ఒక్క క్షణం గుర్తుకురావడం ఆలస్యం కావొచ్చేమో కానీ.. కట్టప్ప అంటే మాత్రం యావత్ భారతీయ సినీ ప్రియుల మదిలో టక్కున మెదులుతారు. బాహుబలి చిత్రంలో కట్టప్ప పాత్ర, ఆ పాత్రలో సత్యరాజ్ నటన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఒకప్పడు తమిళ ఇండస్ట్రీలో హీరోగా ఓ వెలుగు వెలిగిన సత్యరాజ్.. వయసు పైబడిన తర్వాత సహాయక పాత్రలతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి సూపర్ సక్సెస్ అయ్యారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. బాహుబలి మూవీతో జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
సత్యరాజ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే..1979లో నిర్మాత మాదంపట్టి శివకుమార్ మేనకోడలు మహేశ్వరిని సత్యరాజ్ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. సత్యరాజ్ కుమారుడు సిబి రాజ్ కూడా నటుడే. తమిళ ఇండస్ట్రీలో సిబిరాజ్ హీరోగా సత్తా చాటుతున్నాడు. 2008లో చెన్నైలోని ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ రేవతిని సిబి వివాహం చేసుకున్నాడు.
ఇక సత్యరాజ్ కు దివ్య అనే కూతురు ఉంది. గ్లామర్ పరంగా ఆమె ముందు హీరోయిన్లు కూడా సరిపోరు. పైగా భారీ సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీలో దివ్య జన్మించింది. అయినప్పటికీ ఆమె సినీ పరిశ్రమ వైపు రాలేదు. న్యూట్రిషియన్ గా కెరీర్ కొనసాగిస్తుంది. అలాగే దివ్య మహిళ్మతి ఇయక్కం పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి సోషల్ సర్వీస్ చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటే దివ్య.. ఎప్పటికప్పుడు హెల్త్, లైఫ్ స్టైల్ కు సంబంధించి విశేషాలను అందరితో పంచుకుంటూ ఉంటుంది.
View this post on Instagram