నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ కి సంబంధించిన మనీలాండరింగ్ దర్యాప్తులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరోసారి బుధవారం ED ముందు హాజరయ్యారు.
మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) కింద 36 ఏళ్ల జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ని విచారించి స్టేట్మెంట్ను అధికారులు రికార్డ్ చేస్తారు.
ఇప్పటికే ఆమె చంద్రశేఖర్‌తో పాటు ఈ కేసులో రెండుసార్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణ ఎదుర్కొంది.
కొంతమంది ఉన్నత స్థాయి వ్యక్తుల నుండి డబ్బు వసూలు చేసి చంద్రశేఖర్ అందులో కొంత ఆమెకు ఇచ్చాడన్నది ఆరోపణ. తనకు ఎటువంటి డబ్బు అందలేదని జాక్వెలిన్ నిర్ద్వంద్వంగా ఖండించింది.
డిసెంబరు 5న ముంబై విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్తున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను ED ఆపివేసింది. దర్యాప్తులో కోసం ఆమెను దేశంలోనే ఉండాలని ఈడీ ఆదేశించింది.
ఈడీ గత వారం కూడా ఇక్కడ ప్రత్యేక మనీలాండరింగ్ చట్టం (పిఎమ్‌ఎల్‌ఎ) కోర్టు ముందు చార్జ్ షీట్ దాఖలు చేసింది. అందులో చంద్రశేఖర్, అతని భార్య మరియు మరో ఆరుగురి పేర్లను పేర్కొంది. విచారణలో చంద్రశేఖర్
జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు కొన్ని పెర్షియన్ క్యాట్స్, ఒక గుర్రంతో పాటు పలు అనేక ఖరీదైన బహుమతులు ఇచ్చానని పేర్కొన్నట్లు చార్జ్ షీట్లో పేర్కొంది.
అందానికి ఆకర్షణ ఎక్కువ. ఆశ కూడా ఎక్కువ. అదే ఆమెను నేడు చిక్కుల్లోకి నెట్టింది.