జగన్ అంటే విపరీతంగా భక్తిప్రపత్తులు చూపి ఒక్కో వర్గాన్ని జగన్ సెట్ చేసుకుంటూ వస్తున్నాడు. జగన్ వస్తే మేమిక హాయిగా ఉండొచ్చన్న భ్రమలను తొలగిస్తూ మీరు చంద్రబాబు క్రమశిక్షణనే చూశారు నా నియంతృత్వాన్ని చూడలేదు అన్నట్టు జగన్ వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు.
ఇటీవల జర్నలిస్టుల పట్ల జగన్ వ్యవహరించిన తీరుపై జర్నలిస్టులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. జర్నలిస్టులకు జరిగిన అన్యాయంపై నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. జగన్ తనకు నచ్చిందే పాలనగా చేసుకుంటూ పోతున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలతో జగన్ రాజకీయ జీవితానికి శాశ్వత సమాధి ప్రజలే కడతారని లోకేష్ విమర్శించారు. లోకేష్ రియాక్షన్ ను ఇక్కడ యతాథతంగా చదవండి.
చేసిందే చట్టం, ఇచ్చేదే జీవోగా జగన్ సర్కారు వ్యవహరిస్తోంది. జీఓ నెంబర్ 2430 తెచ్చి మీడియా గొంతు నొక్కారు. జీవో 142 తెచ్చి పాత్రికేయులకు ఉన్న ఒకే ఒక సౌకర్యం అక్రిడిటేషన్ పీకేశారు. అక్రిడిటేషన్ కమిటీలో జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలకు చోటు లేకపోవడం వింతల్లోకెల్లా వింత. టిడిపి హయాంలో ఇచ్చిన అక్రిడిటేషన్లలో 10 శాతం కూడా ఇవ్వడంలేదు. జీవోని అడ్డుపెట్టుకుని తన మీడియా వారికే అక్రిడిటేషన్లు ఇచ్చి.. మిగిలిన జర్నలిస్టులందరి మొండిచేయి చూపడం చాలా దారుణం. అక్రిడిటేషన్ జర్నలిస్టుల హక్కు. పనిచేసే జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది.