2019 నుంచి
బీజేపీ ఏపీలో గెలిచిన ఎంపీలు – 0
బీజేపీ ఏపీలో గెలిచిన ఎమ్మెల్యేలు – 0
బీజేపీ ఏపీలో గెలిచిన ఎమ్మెల్సీలు – 0
బీజేపీకి మీడియా అవసరం ఉందా?
మీడియాకు బీజేపీ అవసరం ఉందా?
ఏపీలో కనీసం ఏకపాత్రాభినయానికి కూడా నోచుకోని బీజేపీ ఏబీఎన్ ఛానెల్ ను ఏపీ బీజేపీ బహిష్కరించిందట. పాపం రాధాకృష్ణకు పెద్ద కష్టం వచ్చిపడిందే.
పొరపాటున ఎవరిని అయినా తెచ్చి బీజేపీ వాళ్లు అని కనుక ఛానెల్లో చూపెడితే రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారట ఏపీ బీజేపీ వాళ్లు… అయ్యయ్యయ్యో పాపం రాధాకృష్ణకు పెద్ద కష్టం వచ్చిపడిందే.
బహిరంగంగా క్షమాపణ చెప్పిన తర్వాతే బీజేపీ ఏబీఎన్ ఛానెల్ క్షమిస్తుందట. పాపం బీజేపీ వాళ్లు రాకపోతే రాధాకృష్ణ ఛానెల్ ఏమైపోతుందో, ఎలా బతుకుతుందో కదా.
బీజేపీ వాళ్లు రాకపోతే రేపటి నుంచి పాపం రాధాకృష్ణ ఏబీఎన్ ఛానెల్ ను ఎవరూ చూడరేమోనే. పాపం రాధాకృష్ణకు పెద్ద కష్టం వచ్చిపడిందే. !
కొసమెరుపు: అమరావతి జేఏసీ నాయకుడు శ్రీనివాసరావు బీజేపీ నాయకుడిని ఏబీఎన్ ఛానెల్లో చెప్పుతో కొడితే మధ్యలో తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధమో బీజేపీ చెప్పాలి. నరనరాన తెలుగుదేశాన్ని బదనాం చేయడానికి బీజేపీ కంకణం కట్టుకున్నది అన్న విషయానికి ఈ కింది ప్రెస్ నోటే ఉదాహరణ… అవునంటారా? కాదంటారా?
అధికార ప్రకటన
పత్రికా ప్రమాణాలు, టీవీ ఛానల్ నైతిక విలువలు గాలికొదిలేసి తెలుగుదేశం పార్టీ కరపత్రిక, ప్రసార సాధనంలా పనిచేస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రశాఖ ఇక నుంచి బహిష్కరిస్తున్నది. pic.twitter.com/aUe0YwuNcW
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) February 24, 2021