ఇవాల్టి రోజున ఒక దినపత్రికను నడపటం అంత తేలికైన విషయం కాదు. అందునా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గళం విప్పే విషయంలో అస్సలు వెనక్కి తగ్గని వైనం సమస్యలతో కూడుకున్నది. అందునా తెలుగు రాష్ట్రాలకు చెందిన కేసీఆర్, జగన్ లాంటి ముఖ్యమంత్రులను తట్టుకొని నిలవటం అంత ఈజీ కాదు. ఈ విషయంలో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాక్రిష్ణను ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో అందునా ఏపీలో సీఎం జగన్ కు వ్యతిరేకంగా వ్యవహరించే మీడియా హౌస్ లు కాసిన్ని ఉన్నా.. తెలంగాణలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను తట్టుకొని నిలవటం అంత తేలికైన విషయం కాదు. ఎప్పుడు ఏ రీతిలో ఆయన రియాక్టు అవుతారో చెప్పటం అంత ఈజీ కాదు. టీవీ మీడియాలో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించిన టీవీ9 విషయంలో కేసీఆర్ కు ఆగ్రహం రావటం.. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికి తెలిసిందే.
టీవీ9కే అలాంటి పరిస్థితి ఉంటే.. మన పరిస్థితి ఏమిటని మిగిలిన వారు గమ్మున ఉన్నట్లుగా చెబుతారు. అలాంటి పరిస్థితుల్ని తట్టుకొని మరీ నిలిచిన మీడియా యజమాని ఎవరైనా ఉన్నారా? అంటే అది ఆంధ్రజ్యోతి రాధాక్రిష్ణనే. ఇక్కడో విషయాన్ని చెప్పాలి. కేసీఆర్ తో స్నేహం చేసినా.. గొడవ పెట్టుకున్నా.. అన్నింటికి తట్టుకొని నిలబడింది మాత్రం ఆంధ్రజ్యోతి ఆర్కేనే.
అలాంటి ఆయన.. తాజాగా రాసిన తన ఆర్టికల్ లో సీఎం కేసీఆర్ ఎంత లక్కీ ఫెలో అన్న విషయాన్ని విశ్లేషణ రూపంలో అందించారు. ఆయన ఆర్టికల్ మొత్తాన్ని చూసినప్పుడు కేసీఆర్ కు ధీటైన నేత ఎవరు ఉన్నారు? అన్న ప్రశ్నతో మొదలై.. ఉన్న అవకాశాల్ని విశ్లేషించుకుంటూ వెళ్లారు. కేసీఆర్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవాలని తపిస్తున్న రెండు జాతీయ పార్టీలకు ఉన్న పరిమితుల్ని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఉత్తరాది రాజకీయాలు.. దక్షిణాది రాజకీయాలకు మధ్యనున్న వ్యత్యాసాన్నివివరించే ప్రయత్నం చేశారు.
తెలంగాణలో బీజేపీ ఎందుకు ఎదగటం లేదు? ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మోడీకి ప్రజలు ఎందుకు ఆకర్షించలేకపోతున్నారు? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. గ్రామాల్లోని వారు ముఖ్యంగా 40 ఏళ్లకు పైబడిన వారు మోడీకి ఆకర్షితులు కావటం లేదన్నారు. దీనికి తోడు తెలంగాణ బీజేపీలో ఉన్న గ్రూపుల పంచాయితీ గురించి వివరంగా బయటకు చెప్పేశారు. మొత్తం మూడుగా విడిపోయిన గ్రూపుల మధ్య అధిపత్య పోరు టీబీజీపీకి ఇబ్బందికరంగా మారిందన్నది నిజం. ఇదే విషయాన్ని ఆయన చెప్పేశారు.
అదే సమయంలో టీపీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డిని తమ నాయకుడిగా కాంగ్రెస్ లో అందరూ కాకున్నా మెజార్టీ కాంగ్రెస్ నేతలు.. కార్యకర్తలు.. అభిమానులుఒప్పుకుంటున్నారని.. కానీ బీజేపీ విషయానికి వస్తే బండిని ఓకే చేసేటోళ్లు తక్కువగా ఉన్నారు. కేసీఆర్ కు ధీటైన నాయకుడిగా టీబీజేపీలో చూపించే నాయకుడు ఎవరైనా ఉన్నారన్నంతనే సమాధానం చెప్పటం కాస్త కష్టమే. మరీ.. దీర్ఘంగా వెతికితే ఈటెల రాజేందర్ కనిపిస్తారు. అయితే.. ఆయన్ను మోడీషాలు ఎంతమేర నమ్ముతారన్నది ప్రశ్న.
బండి సారథ్యంలోని టీబీజేపీ తెలంగాణ ప్రజల్లో ఏ మేరకు విశ్వాసాన్ని నెలకొల్పుతుందన్నది ప్రశ్న. దీనికి కారణం లేకపోలేదు. ఈ రోజు వరకు ఈ పార్టీ తరఫున సరైన నేత ఉన్నది లేదు. ఎవరున్నా కూడా వారెవరూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సరిసమానంగా నిలబడే స్టేచర్ ఉందా? అన్న ప్రశ్నకు సానుకూల సమాధానం రాని పరిస్థితి.
ఇలాంటి పరిస్థితే మరికొంత కాలం నెలకొంటే.. తెలంగాణలో ఇప్పటివరకు తెచ్చుకున్న క్రెడిబిలిటీ మొత్తం ఖరాబు అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. అందుకే.. ఆంధ్రజ్యోతి ఆర్కే హెచ్చరిస్తున్నట్లుగా బీజేపీ అధినాయకత్వం తెలంగాణలో అధికారం కావాలని బలంగా కోరుకుంటే.. ప్రక్షాళన తప్పనిసరి అతుయ్యితే.. అదేదోముందే చేసేస్తే.. తలనొప్పులు ఉండవన్నవిషయాన్ని గుర్తించాలి.