వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ డర్టీ పిక్చర్ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, తనను కావాలనే అప్రతిష్టపాలు చేయాలని టీడీపీ నేతలు కొందరు కంకణం కట్టుకున్నారని గోరంట్ల ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తన న్యూడ్ వీడియో ప్రసారం చేశారంటూ అసభ్య పదజాలంతో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సహా కొన్ని మీడియా ఛానెళ్లు, వ్యక్తులపై మాధవ్ వ్యక్తిగత దూషణలకు కూడా దిగారు. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణను అసభ్యపదజాలంతో వ్యక్తిగతంగా దూషించారు.
ఈ నేపథ్యంలోనే గోరంట్ల మాధవ్ కు షాక్ తగలనుంది. మాధవ్ పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే నిర్ణయించుకున్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌పై రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేయాలని ఆయన డిసైడ్ అయ్యారు. అంతేకాదు, మాధవ్ పై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని హైకోర్టులో దావా వేయాలని నిర్ణయించుకున్నారు.
వాస్తవానికి గోరంట్ల డర్టీ వీడియోను తొలుత ప్రసారం చేసింది ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్. దీంతో, ఆ ఛానెల్ యజమాని వేమూరి రాధాకృష్ణపై ఎంపీ మాధవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే, మాధవ్ వీడియోపై ఎస్పీ ఫకీరప్ప వీడియో విదులైన తర్వాత మరోసారి ఆర్కేపై బుధవారం నాడు మాధవ్ నోరుపారేసుకున్నారు. మాధవ్ ఆగ్రహంతో తీవ్రమైన పదజాలంతో ఏబీఎన్ ఛానెల్‌ను, ఎండీ రాధాకృష్ణను దూషించారు. ఈ క్రమంలో మాధవ్‌పై పరువు నష్టం దావా వేయడానికి రాధాకృష్ణ సిద్దమయ్యారు.