రికార్డు సాధించడానికి శ్రమించాలి.. కష్టపడాలి.. పుస్తకాలు చదవాలి.. పర్వతాలు ఎక్కాలి.. అనుకుంటున్నారా? అయితే.. మీకు ఐడియాలు రానట్టే!! ఎందుకంటే.. ఇంత పెద్ద పెద్ద కష్టాలు పడకుండా.. ఇంట్లోకులాసాగా కూర్చుని కూడా `ప్రపంచ రికార్డు`లు కొట్టేయచ్చని నిరూపిస్తున్నాడు.. కర్ణాటకకు చెందిన యువకుడు.
అతను ప్రపంచ రికార్డు కోసం.. చేసింది. వింతల్లోనే వింత అని నెటిజన్లు అంటున్నారు. మరి అదేంటో.. చూడండి.. కుదిరితే.. మీరూ `ట్రై` చేసి రికార్డు కొట్టేయండి!!
తృణ ధాన్యాలుగా పిలిచే కొర్రలు.. ఎలా ఉంటాయి. మనవాళ్లు నిత్యం వంటలో వినియోగించే ఆవాల సైజు కన్నా తక్కువగానే ఉంటాయి. అయితే.. ఒక కిలోకు ఎన్ని కొర్రలు(అంటే సంఖ్య) ఎన్ని అని ఎవరైనా అడిగితే.. ఏం చెబుతారు? `నువ్వేమన్నా తిక్కలోడివా?` అని మొహం మీదే అడిగేస్తారు. ఈ పాయింటే.. కర్ణాటకకు చెందిన అభిషేక్‌కు ప్రపంచ రికార్డు వచ్చేలా చేసింది. కర్ణాటకకు చెందిన అభిషేక్ మాత్రం 87 గంటల్లో ఒక కిలో కొర్రలను లెక్కించి `ఇండియాస్ వరల్డ్ రికార్డ్స్‌లో` చోటు సాధించాడు.
నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇంట్లోనే కూర్చుని అభిషేక్ కొర్రలు లెక్కించాడు. కిలోకు మొత్తం 4 లక్షల 4 వేల 882 కొర్రలు ఉంటాయని లెక్క చూపించాడు. దీంతో ప్రఖ్యాత ఇండియాస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు.
ఈ ఘనత సాధించేందుకు మొత్తం 87 గంటల 35 నిమిషాలు కష్టపడ్డాడు అభిషేక్. ప్రతి 500 కొర్రలను ఒక ప్యాకెట్‌గా చేశాడు. ఇండియా వరల్డ్ రికార్డ్స్ యాజమాన్యం సమక్షంలోనే ఈ పని పూర్తి చేయడం గమనార్హం.