బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ తనకు లవ్ ప్రపోజల్ చేసిన తన జిమ్ ట్రైనర్ కు ఓకే చెప్పింది. పెళ్లికి సైతం ఎస్ అని చెప్పటం ద్వారా.. రెండేళ్లుగా వినిపిస్తున్న లవ్ రూమర్లకు చెక్ చెప్పేసి.. రియల్ ప్రేమికులుగా మారిపోయారు. తాజాగా రీల్ కు ఏ మాత్రం తీసిపోని రియల్ లవ్ ప్రపోజల్ వేళ.. ఐరా వెంటనే ఓకే చెప్పేయటం.. లవ్ బర్డ్స్ ఇద్దరూ అందరి ముందు ఫ్రెంచ్ కిస్ ఇచ్చుకోవటంతో వీరి ప్రేమాయణం అధికారికమైంది.
తాజాగా ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ లోనూ తన ఫిట్ నెస్ ట్రైనర్ సుపుర్ శిఖారేతో తన లవ్ ఎపిసోడ్ ను ప్రస్తావించి.. వీడియోను షేర్ చేసింది. ఇటీవల సుపుర్ తో కలిసి విదేశాలకు వెళ్లింది ఐరా. సైక్లింగ్ పోటీల్లో పాల్గొన్న అతను.. పోటీ ముగిసిన తర్వాత ఐరా వద్దకు రావటం.. చిన్నపాటి హగ్ చేసుకొని ముద్దు ఇచ్చాడు సుపుర్. ఆ వెంటనే మోకాలి మీద కూర్చున్న అతను.. తన లవ్ ప్రపోజ్ చేశాడు.
పెళ్లికి గురించి అడిగాడు. దీనికి క్షణం ఆలోచించని ఐరాఖాన్.. ఆ వెంటనే ఓకే చేసేసింది. ఆ వెంటనే తన వద్ద ఉన్న రింగ్ తీసుకొని.. ఆమె చేతి వేలికి తొడగటం ద్వారా.. విషయాన్ని తర్వాతి లెవల్ కు తీసుకెళ్లారు వారిద్దరు. ఐరా చేతి వేలికి ఉంగరం తొడగటం ద్వారా లవ్ ఎపిసోడ్ ను మరో లెవల్ కు తీసుకెళ్లిన వీరు.. స్టేడియంలోనే ఫ్రెంచ్ కిస్ చేసుకున్నారు. అనంతరం ఇన్ స్టాలో దీనికి సంబంధించిన స్టోరీ షేర్ చేస్తూ.. ‘నేను ఎస్ చెప్పాను’ అని పేర్కొన్నారు.
ఈ పోస్టుకు పలువురు ప్రముఖులు.. సెలబ్రీటీలు అభినందనలు తెలియజేస్తుననారు. ఐరాకు పర్సనల్ ట్రైనర్ గా చేరిన సుపుర్.. ఆమెకు ఫిట్ నెస్ పాఠాలు బోధించేవారు. అనంతరం వారి మధ్య స్నేహం చిగురించి.. తర్వాతి కాలంలో ప్రేమికులుగా మారినట్లుగా తరచూ వార్తలు రావటం తెలిసిందే. తాజాగా వారి బంధాన్ని అధికారికంగా తెలియజేసినట్లైంది. ఏమైనా.. సినిమాల్లో కనిపించే సీన్ ను.. రియల్ సీన్ చేసి.. ఆ వీడియోను షేర్ చేసుకోవటం విశేషం.