కొంతకాలం కిందట డ్రగ్స్ కేసులో రకుల్ ఎంతగా బ్లేమ్ అయ్యిందో అందరికీ తెలిసిందే. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి కేసు అనేక మలుపులు తిరిగి డ్రగ్ మాఫియా వద్ద ఆగింది. సినీ పరిశ్రమలో డ్రగ్ రాకెట్ గురించి పెద్దపెద్ద వార్తలు వచ్చాయి. చాలామందిపై సంచలన ఆరోపణలు వచ్చాయి. అలాంటి ఆరోపణలు రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఎదుర్కొంది. రియా డ్రగ్ మాఫియా డాన్ గా అప్పట్లో అందరూ అనుకున్నారు. ఇందులో మన టాలీవుడ్ రకుల్ పేరు బయటకు రావడం టాలీవుడ్ ని షేక్ చేసింది.
మీడియా రకుల్ ని టార్గెట్ చేసింది. ఆమెను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారణకు కూడా పిలిచారు. దీంతో మీడియాలో వచ్చిన వార్తలు నిజమేమో అని చాలామంది నమ్మారు. రకుల్ పెద్ద డ్రగ్ బానిస అన్నట్లు ప్రచారమైపోయింది. అయితే, నేటికి అందులో ఆమె పాత్ర ఎంతో తేలలేదు. అయితే, రకుల్ కి ఈరోజు పెద్ద గుడ్ న్యూస్ వచ్చింది. అప్పట్లో వెంటనే రకుల్ డ్రగ్స్ కేసులోకి తన పేరు అనవసరంగా లాగారని కోర్టుకు వెళ్లింది. తాజాగా రకుల్ న్యాయ పోరాటం ఫలించింది.
న్యూస్ బ్రాడ్కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ (ఎన్బీఎస్ఏ)., వాస్తవాలు నిర్ధారించకుండా రకుల్ మీద తప్పుడు వార్తలు ప్రచారం చేసిన జీ గ్రూప్ ఛానెళ్లు జీ న్యూస్, జీ24 తాజ్, జీ హిందుస్థానిలపై ఆగ్రహం వ్యక్తంచేసింది. రకుల్ ప్రీత్ సింగ్ పై నిరాధార ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని ఆ సంస్థలను ఆదేశించింది. ఈ వార్తలు ప్రసారం చేసిన ఇతర ఛానెళ్లను కూడా ఎన్బీఎస్ఏ హెచ్చరించడం గమనార్హం. మొత్తానికి రకుల్ హ్యాపీ అన్నమాట.