గత రెండు దశాబ్దాల్లో దక్షిణాది నుంచి వచ్చిన ఎగ్జైటింగ్ డైరెక్టర్లలో గౌతమ్ మీనన్ ఒకరు. ‘కాక్క కాక్క’తో కెరీర్ ఆరంభంలోనే ప్రపంచ స్థాయి సినిమాను డెలివర్ చేసిన ఆయన.. ఆ తర్వాత ఏమాయ చేసావె, వేట్టయాడు విలయాడు (తెలుగులో రాఘవన్), సూర్య సన్నాఫ్ కృష్ణన్ లాంటి చిత్రాలతో మెస్మరైజ్ చేశారు. ఇంకా ఆయన్నుంచి ఎన్నో అద్భుతాలు ఆశిస్తుంటే.. ప్రొడక్షన్లోకి అడుగు పెట్టి గట్టి ఎదురు దెబ్బలు తిన్నాడు. ఆ సంస్థకు సంబంధించిన ఆర్థిక వివాదాల కారణంగా కొన్నేళ్ల నుంచి సినిమాల మేకింగ్ మీదే దృష్టిపెట్టలేకపోతున్నాడు గౌతమ్.
ఆయన సినిమాలు వరుసగా పెండింగ్‌లో పడిపోవడం తెలిసిందే. అందులోంచి ఒక్కోటి రిలీజవుతున్నప్పటికీ అవి అంచనాలను అందుకోవడం లేదు. ధనుష్‌తో చేసి సినిమా తుస్సుమనిపించగా.. విక్రమ్‌తో చేసిన సినిమా త్వరలోనే రిలీజవుతుందంటున్నారు. దాని సంగతేమో కానీ.. కొంచెం గ్యాప్ తర్వాత గౌతమ్ ఇప్పుడో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టును లైన్లో పెట్టాడు. అదే.. వేందు తనిందదు కాదు.
ఇంతకుముందు గౌతమ్‌తో కలిసి చేసిన ‘విన్నైతాండి వరువాయ’ (ఏమాయ చేసావె తమిళ వెర్షన్) ఆల్ టైం క్లాసిక్ లవ్ స్టోరీల్లో ఒకటిగా నిలిచిపోయింది.
ఆ తర్వాత ఇద్దరూ కలిసి చేసిన ‘అచ్చం ఎన్బదు మదమైయాద (సాహసం శ్వాసగా సాగిపో తమిళ వెర్షన్) సరిగా ఆడలేదు. ఐతే ఇప్పుడు ఇద్దరూ కలిసి రెగ్యులర్ లవ్ స్టోరీ కాకుండా ఒక వెరైటీ చిత్రం చేయడానికి రెడీ అయినట్లున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది. కాటి కాపరి వేషంలో సింధు పెద్ద షాకే ఇచ్చాడు. ఇలాంటి నేపథ్యంలో గౌతమ్ సినిమా తీయడం షాకింగే. ఇది రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుందట. గౌతమ్ ఇప్పటిదాకా దాదాపుగా అన్నీ అర్బన్ స్టోరీలే తీశాడు. ఇలా పల్లెటూరి నేపథ్యంలో ఓ కాటి కాపరి మీద సినిమా అంటే.. అందరికీ బాలానే గుర్తుకొస్తాడు. ఇది గౌతమ్‌కు ఓ వైవిధ్యమైన సినిమా అవుతుందనడంలో సందేహం లేదు. త్వరలోనే షూటింగ్ ఆరంభించుకోనున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌తో ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించింది.