హైదరాబాద్ వంటి కాస్మోపాలిటన్ సిటీలో అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతోందో…పాశ్యాత్య సంస్కృతి కూడా అంతే వేగంగా జడలు విప్పుకుంటోంది. పాశ్యాత్య ధోరణులకు అలవాటుపడ్డ యువతను మత్తులోకి దించేందుకు నగరంలో డ్రగ్స్ ముఠాలు కోట్లరూపాయల వ్యాపారం చేస్తున్నాయి. మరోవైపు, విచ్చలవిడితనానికి అలవాటుపడ్డ కొందరి కోసం నగరంలో మసాజ్ సెంటర్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు, వ్యభిచారం నిర్వహించడం నిత్యకృత్యమైపోయింది.
పోలీసులు ఎన్నిసార్లు దాడులు చేసినా…శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు గుట్టుమట్టుగా ఈ పాడు పనులను మసాజ్ సెంటర్ నిర్వాహకులు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా బంజారాహిల్స్‌లోని ఓ మసాజ్ కేంద్రంపై హైదరాబాద్ పోలీసులు దాడి చేశారు. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12లో నిర్వహిస్తున్న మసాజ్ సెంటర్ లో అసాంఘిక, అశ్లీల కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న సమాచారంతో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆ మసాజ్ సెంటర్ లో ఉన్న ఆరుగురు మహిళలు, ఇద్దరు విటులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఈ మసాజ్ సెంటర్ పేరుతో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న ముందస్తు పక్కా సమాచారంతో వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ మసాజ్ సెంటర్ వెనుక ఎవరెవరు ఉన్నది తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.