రాజ్ కుంద్రా యొక్క పో-ర్న్ రాకెట్ కేసు ప్రతిరోజూ కొత్త మలుపులు తిరుగుతోంది.
కొత్త కొత్త వ్యక్తులు బయటకు వస్తున్నారు.
నెలరోజుల క్రితం ఇదే కేసులో అరెస్టయిన నటి గెహన్ వసిష్ట్ ఇప్పుడు ముంబై పోలీసులపై సంచలన ఆరోపణలు చేస్తోంది.
ఈ ఏడాది ప్రారంభంలో పోర్న్ రాకెట్ కేసులో గెహన్ వసిష్ట్ అరెస్టయ్యారు.
అరెస్టు కాకుండా ఉండేందుకు ముంబై పోలీసులు తన నుంచి 15 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని ఆమె ఆరోపించింది.
తాను చట్టవిరుద్ధంగా ఏమీ చేయలేదని వారికి వివరించడానికి ప్రయత్నించానని, డబ్బులు ఇవ్వడానికి అంగీకరించలేదని… దీంతో వారు తనను అరెస్టు చేశారని గెహన చెప్పింది.
యశ్ ఠాకూర్ అలియాస్ అరవింద్ కుమార్ శ్రీవాస్తవ, తన్వీర్ హష్మీ వాట్సాప్ సంభాషణల్లో పోలీసులు వారి నుండి రూ .8 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు ఆధారాలున్నట్లు గెహన వశిష్ట్ ఉన్నాయని వెల్లడించారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో గెహనా అరెస్టయ్యారు. నాలుగు నెలలు ఆమె జైలులో ఉన్నారు. రాజ్ కుంద్రా యొక్క హాట్ షాట్ యాప్ పోర్న్ ఫిల్మ్స్ కేసులో ఆమె పేరు పోలీసు FIR లో చేర్చారు.
అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఆమె పోలీసులకు రూ.15 లక్షలు లంచంగా ఇచ్చేందుకు సిద్ధమైందని తాజాగా వెలుగులోకి రావడంతో గెహన వశిష్ట్ ఫ్లేటు ఫిరాయించి పై ఆరోపణలు చేసిందని అంటున్నారు.
గతంలో తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులతో . ‘నన్ను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు మీకెంత కావాలో చెప్పండి’ అని గెహన వశిష్ట్ ఆఫర్ ఇచ్చారట. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో గెహన ప్లేటు ఫిరాయించింది. తనను పోలీసులే లంచం డిమాండ్ చేశారని ఆమె ఆరోపిస్తోంది.