వరద కష్టం దారుణంగా ఉంది. వందేళ్లలో హైదరాబాదు చూడని విపత్తు ఇది. ఇంత భారీ వానలు మునుపెన్నడూ లేవు. హైదరాబాదుకు వేల కోట్ల నష్టం వాటిల్లింది. రాత్రి ఇంటి ముందు పెట్టిన కార్లు పొద్దున మాయమయ్యాయి. లారీల వంటి వాహనాలు కూడా వరదకు కొట్టుకుపోయాయి.
ప్రభుత్వం ఈ వరద ముప్పు నుంచి ప్రజలను కాపాడటంలో ఘోరంగా విఫలమైంది. వరద ప్రమాదాన్ని సరిగా అంచనా వేయలేక వారికి ఆస్తి నష్టం వాటిల్లేలా చేసింది. దీంతో ప్రభుత్వం మీద ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఎంత సేపు నిజామాబాద్, దుబ్బాక ఉప ఎన్నికలపై దృష్టటిపెట్టి మమ్మల్ని గాలికి వదిలేసిందని ప్రజలు వాపోయారు.