రాజ్యసభ - జగన్ కి బ్యాడ్ న్యూస్
దరిద్రం అదృష్టంలా పడితే తాడే పామై కరుస్తుందంటారు. పాపం... ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి బీజేపీ అండ లభించడానికి ఏకైక కారణం తన బిల్లులు అన్నింటికీ వైకాపా మద్దతు పలకడమే. తద్వారా తన అవసరం వాళ్లకు కొద్దిగా ఉండటం వల్ల బీజేపీ జగన్ రెడ్డికి కొంత సహకరిస్తోంది. అయితే, జగన్ అవసరం వారికి భారీగా తగ్గిపోనుంది. దీనికి కారణం.. మరో నెలరోజల్లో రాజ్యసభలో బీజేపీ బలానికి మరో పది మంది ఎంపీలు జతకానున్నారు.
రాజ్యసభలో 11 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వాటిలో ఒకటి ఉత్తరాఖండ్. 10 యూపీ. ఈ సీట్లన్నీ ఎమ్మెల్యే ఓట్లతో గెలిచే సీట్లే. అయితే, ప్రస్తుతం ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీకి ఎమ్మెల్యేల ఆధిక్యం ఉండటంతో ఈ 11 స్థానాల్లో 10 స్థానాలు బీజేపీ గెలవనుంది. ఈ గెలుపు వల్ల రాజ్యసభలో బీజేపీ బలం 110 నుంచి 120కి పెరగనుంది.
రాజ్యసభ మొత్తం సభ్యుల సంఖ్య 245. అంటే ఏదైనా బిల్లు గెలవాలంటే 123 సీట్లు బీజేపీకి కావాలి. తాజా రాజ్యసభ ఎన్నికల అనంతరం బీజేపీకి ఇక 3 సీట్లే అవసరం. అపుడు దేశంలో ఏ ఒక్క పార్టీ తనకు మద్దతు ఇచ్చినా ఎన్డీయే బలం మెజారిటీ అవుతుంది. ఆ 3 సీట్లు జగనే అవ్వాల్సిన అవసరం లేదు. మొన్నటి 7 బిల్లులకు మాత్రం జగన్ సీట్లు వారికి అవసరం అయ్యాయి. కానీ ఇకపై జగన్ తో వారికి పెద్దగా పనిలేదు.
లోక్ సభలో ఎలాగూ బీజేపీకి పూర్తిగా సొంతబలం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీకి బలం పెరగడం జగన్ కి బ్యాడ్ న్యూసే. ఆ 3 సీట్లు కూడా మరో ఆర్నెల్లలో బీజేపీకి వచ్చేస్తాయి. ఈ నేపథ్యంలో జగన్ స్నేహం బీజేపీకి నష్టమే గానీ లాభం కాదు. ఎందుకంటే బీజేపీ హిందు పార్టీ. వైసీపీ క్రిస్టియన్ పార్టీ (ఇది జగన్ తల్లే ఒకట్రెండు సార్లు ప్రకటించారు. స్వయంగా కొందరు ఐఏఎస్ లు కూడా ప్రకటించారు). ఈ నేపథ్యంలో జగన్ తో స్నేహం బీజేపీకి ఏ నాటికి అయినా నష్టమే కానీ లాభం కాదు. ఏదో తాత్కాలిక అవసరం కోసం వాడుకుంది. మరి ఇక పై ఏం జరుగుతుందో చూడాలి. ఎంతైనా గడ్డుకాలమే అని చెప్పొచ్చు.