సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్లలో సమంతది ప్రత్యేకమైన శైలి. ‘ఏమాయ చేసావె’ లాంటి క్లాసిక్‌తో కథానాయికగా పరిచయమై.. ఆ తర్వాత కమర్షియల్ సినిమాల్లో మెరిసి స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఆమె.. ఆ తర్వాత పెర్ఫామెన్స్‌కు మంచి స్కోప్ ఉన్న పాత్రలతో, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సత్తా చాటింది.
ఐతే కెరీర్లో మంచి ఊపులో ఉండగానే పెళ్లి చేసుకోవడంతో సమంత కెరీర్ ముగిసినట్లే అని చాలామంది తీర్మానించేశారు. కానీ పెళ్లి తర్వాత కూడా అవకాశాలు అందుకుని, భారీ విజయాలు సొంతం చేసుకుని తనకు తానే సాటి అని రుజువు చేసిందామె. రంగస్థలం, మహానటి లాంటి చిత్రాలు సమంతకు పెళ్లయ్యాక వచ్చినవే.
ఐతే తర్వాత తనకు తానుగా సినిమాలు తగ్గించుకుని, గ్లామర్ రోల్స్‌కు పూర్తిగా టాటా చెప్పేయడంతో తన కెరీర్ డల్లయినట్లే కనిపించింది. ‘ఓ బేబీ’ తర్వాత తెలుగులో సామ్ సినిమానే చేయకపోవడం గమనారÛం. ఐతే కొంచెం గ్యాప్ తీసుకుని ‘శాకుంతలం’ లాంటి భారీ చిత్రాన్ని లైన్లో పెట్టిన సమంత.. ‘ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సిరీస్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
సమంత కంటే ముందు కొందరు స్టార్ హీరోయిన్లు డిజిటల్ డెబ్యూ చేశారు. తమన్నా లెవెంత్ అవర్, నవంబర్ స్టోరీ వెబ్ సిరీస్‌లు చేయగా.. ఇందులో మొదటిది తుస్సుమంది. రెండోది ఆకట్టుకుంది. పెర్ఫామెన్స్ విషయంలో తమన్నాకు ఓ మోస్తరు మార్కులు పడ్డాయి. ‘లైవ్ టెలికాస్ట్’లో కాజల్ తేలిపోయింది.
శ్రుతి హాసన్ ‘పిట్టకథలు’ గురించి చెప్పడానికేమీ లేదు. కానీ సమంత మాత్రం ‘ఫ్యామిలీ మ్యాన్-2’తో వావ్ అనిపించింది. ఇందులో ఆమె చేసిన రాజి క్యారెక్టర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి ఛాలెంజింగ్, డీగ్లామరస్ రోల్‌ను చేయడం అందరి వల్లా సాధ్యం కాదు.
కొన్ని సన్నివేశాల్లో బోల్డ్‌గా కూడా నటించి ఆశ్చర్యపరిచిన ఆమె.. ఎమోషనల్ సీన్స్, యాక్షన్ ఘట్టాల్లో అదరగొట్టింది. మొత్తంగా సమంత క్యారెక్టర్, పెర్ఫామెన్స్ ఒక ప్యాకేజీ అనే చెప్పాలి. లీడ్ రోల్ చేసిన లెజెండరీ యాక్టర్ మనోజ్ బాజ్‌పేయికి దీటుగా నిలిచిన ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణగా మారిన సమంత.. తనకు తానే సాటి అనిపించింది.
ఈ సిరీస్‌లో సమంతకు వచ్చిన అప్లాప్ చూశాక మరో స్ట్రీమింగ్ జెయింట్ నెట్ ఫ్లిక్స్ ఆమెకు రూ.8 కోట్ల ఆఫర్ ఇచ్చి ఒక భారీ వెబ్ సిరీస్ చేయడానికి ప్రణాళికలు రచిస్తోందట. ఇలాంటి అవకాశం మరెవరికీ దక్కలేదు. అందుకే సమంత సమంతనే అంటున్నారు తన అభిమానులు.