వర్షాలకు ముంబై, చెన్నై బెంగళూరు సహా ఆఖరికి సముద్ర మట్టానికి 543 మీటర్ల ఎత్తులో ఉన్న హైదరాబాద్ కూడా మునిగాయి..!! వేల సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోయాయి. ఇల్లలోకి నీళ్లు చేరాయి. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాదు అన్నీ నీట మునిగాయి.
ఏమాటకు ఆ మాటే… తెలుగు రాష్ట్రాల్లో వరద ముంపునకు గురికానిది ఏమైనా ఉందంటే అది అమరావతి రాజధాని ప్రాంతం మాత్రమే. కొందరు జీర్ణించుకోకపోయినా ఇది వాస్తవం. అది ముంపు ప్రాంతం కాదు, లోతట్టు ప్రాంతం కూడా కాదు. అయినా కూడా ముందు జాగ్రత్తగా చంద్రబాబు హయాంలో ఏపీ ప్రభుత్వం కొండవీటి వాగు ద్వారా వరదను మళ్లించే ప్రాజెక్టు కట్టింది. అదొక్కటే కాదు, భవిష్యత్తులో ఎలాంటి వానలు అయినా హ్యాండిల్ చేయగలిగేలా అత్యాధునిక మాస్టర్ ప్లాన్ తో డ్రైనేజీ నిర్మిస్తోంది. అది ఇపుడు సగంలో ఆగిపోయింది. జగన్ రెడ్డి ఆపేశారు.
ఇక తాజాగా ఇపుడు అమరావతి ఎలా ఉందో ఈ చిత్రాల్లో చూడండి.
అమరావతిలో ఉన్న ఒక స్థానికుడు ఈ రోజు ఉదయం తీసిన వీడియోలో అక్కడి పరిస్థతిని తెలుసుకోవచ్చు. కింద లింక్ మీద క్లిక్ చేయండి.