లాటరైట్ ముసుగులో వైసీపీ నేతలు బాక్సైట్ తవ్వకాలు జరుపుతున్నారన ిటీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిదే. వైసీసీ నేతల కనుసన్నల్లోనే యథేచ్ఛగా బాక్సైట్ రాష్ట్రం నుంచి అక్రమంగా తరలివెళుతోందని విమర్శలు వస్తున్నాయి. బాక్సైట్ తవ్వకాల వెనుక టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తనయుడి హస్తం కూడా ఉందని ఆరోపణలు వచ్చాయి. అయితే, అసలు తమ ప్రభుత్వంలో బాక్సైట్ తవ్వకాల ఊసేలేదంటూ వైసీపీ నేతలు బుకాయిస్తూ వచ్చారు.
అయితే, వైసీపీ నేతల కనుసన్నల్లో నడుస్తున్న బాక్సైట్ తవ్వకాలపై టీడీపీ నేతలు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఆధారాలు సేకరించి తీవ్రస్థాయిలో పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతల కష్టానికి తగిన ఫలితం దక్కింది. లేటరైట్ పేరు చెప్పి గిరిజనుల బతుకులు బుగ్గిపాలు చేస్తున్న వైసీపీ నేతల గుట్టురట్టయింది. ఏపీలో బాక్సైట్ దందాపై టీడీపీ పోరాటం నేపథ్యంలో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ స్పందించింది. లేటరైట్ మైనింగ్ పేరుతో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఎన్జీటీలో టీడీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్ పై స్పందన వచ్చింది.
అటవీశాఖ అనుమతులు లేకుండానే వేలాది వృక్షాలను ధ్వంసం చేసి రోడ్డు వేయడాన్ని ఎన్జీటీ తప్పుబట్టింది. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో అక్రమ మైనింగ్ జరిగిందని ఎన్జీటీ గుర్తించింది. తక్షణమే గనుల శాఖ ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలని ఆదేశించింది. అంతేకాదు, మైనింగ్ అక్రమాలకు వత్తాసు పలికిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్జీటీ ఆదేశించింది. అక్రమాలపై విచారణకు ఓ కమిటీని ఏర్పాటు చేసిన ఎన్జీటీ… మన్యం ప్రాంతంలో కమిటీ సభ్యులు పర్యటించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఎన్జీటీ రంగంలోకి దిగడంతో వైసీపీ నేతల గుండెల్లో గుబులు మొదలైంది