2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి ఏపీకి 1.3 లక్ష కోట్ల అప్పుంది.
కేంద్రం చేసిన అక్రమ విభజన వల్ల చేతిలో రూపాయి లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న అధికారిక భవనాలు కట్టడానికి, కొత్త రాష్ట్రం ఏర్పాటుకు అవసరమైన ఖర్చులు మీదపడటం, ఉద్యోగులకు భారీగా జీతాలు పెరగడంతో బాబు హయాంలో 5 సంవత్సరాలకు గాను మరో లక్ష కోట్ల అప్పు అయ్యింది.
అయితే, ఆ అప్పుగురించి వైసీపీ అనేక దుష్ప్రచారాలు చేసింది. దానికి అన్ని సాక్ష్యాలున్నాయి.
అప్పు గురించి అబద్ధాలు అల్లేసి జనాల్ని నమ్మించే అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కారు ఇపుడు ఏడాదికి లక్ష కోట్ల అప్పు చేస్తోంది. అంటే చంద్రబాబు 5 సంవత్సరాల్లో చేసిన అప్పు జగన్ ఏడాదికి చేసేశాడు.
ఇపుడు ప్రతి దానికి ప్రతి నెలా అప్పులే.
ఏపీ అప్పుల గురించి దేశమంతటా చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో బుగ్గన రాజేంద్రనాథ్ చేసిన సంచలన వ్యాఖ్యలు. బుగ్గన తాజా వ్యాఖ్యలతో ఇపుడు వైసీపీ పరువు రోడ్డున పడటమే కాదు, జగన్ అడ్డంగా బుక్కయ్యారు. వైసీపీ అసలు రంగును బయట్టబయలు చేసే ఆ వీడియోను ఇక్కడ చూడొచ్చు.
శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి Vs శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి !#AppulaAndhraPradesh pic.twitter.com/aQTwgajlKF
— Chanandler bOnG ???? (@BongChh) July 29, 2021