చరిత్రలో కనీవినీ ఎరుగని వాన వచ్చింది. తెలంగాణలో వర్షాలు పడ్డాయంటే హైదరాబాద్లో కచ్చితంగా సగటు వర్షపాతం కంటే ఎక్కువే నమోదవుతుంది. బంగాళా ఖాతంలో ఏ వాయుగుండం, అల్ప పీడనం వచ్చినా…. నాకూ హైదరాబాదు రాజధానే అన్నట్టు కచ్చితంగా ఇక్కడ వానలొస్తాయి.
అయితే, ఇంతకాలం ఒకలెక్క ఇపుడు ఒకలెక్క అన్నట్లు వాన వస్తోంది. 4 రోజులుగా కురుస్తున్న వానలు… ఈరోజు సాయంత్రం నుంచి ఆగకుండా వస్తున్నాయి. దీంతో హైదరాబాదు అతలాకుతలం అయ్యింది. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేకుండా అన్నీ జలమయం అయ్యాయి. వర్ష భీభత్సానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు భయం గొల్పుతున్నాయి.
వాటిలో కొన్ని ఇక్కడ చూడొచ్చు