ఔను! ఏపీ సీఎం జగన్పై నమ్మకం పోతోందా? కీలకమైన రెండు వర్గాలు జగన్పై అపనమ్మకంతో రగిలిపోతు న్నాయా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రభుత్వ పాలనను అమలు చేసే.. ఉద్యోగులు.. ప్రభు త్వ పనులు చేసే కాంట్రాక్టర్లు.. ఈ రెండు వర్గాలు.. ఏ ప్రభుత్వానికైనా కుడి-ఎడమ కన్నులతో సమానం. ఈ క్రమంలోనే అన్ని ప్రభుత్వాలు.. ఈ రెండు వర్గాలను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాయి. చిన్న చిన్న లోపా లు ఉన్నప్పటికీ.. ఈ రెండు వర్గాలను తమ పరిధిలో ఉండేలా.. తమ అనునయంలో పనిచేసేలా చూసు కుంటాయి. ఎక్కడా కట్టు తప్పకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటాయి.
అయితే.. ఏపీలో జగన్ రెండేళ్ల పాలన చూసిన తర్వాత.. అటు ఉద్యోగ, ఇటు కాంట్రాక్టర్ వర్గాలు రెండూ కూ డా.. ప్రభుత్వంపై విశ్వాసం సన్నగిల్లిందనే వ్యాఖ్యలు చేస్తున్న విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. ఉద్యోగుల విషయాన్ని తీసుకుంటే.. ఎన్నికలకు ముందు జగన్ వారికి చాలానే హామీలిచ్చారు. ముఖ్యంగా సీపీఎస్(కంట్రిబ్యూటరీ పింఛన్ స్కీం) ఎత్తివేత.. పీఆర్సీ అమలు.. డీఏ అమలు వంటివాటిని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. తాను అధికారంలోకి రాగానే వాటిని నెరవేరుస్తానన్న జగన్ ఇప్పటి వరకు వాటి గురించి పట్టించుకోలేదు. దీంతో ఉద్యోగులు అడిగి అడిగి.. విసిగి వేసారిపోయారనడంలో సందేహం లేదు.
నిజానికి చెప్పాలంటే.. గతంలో చంద్రబాబు పాలన సమయంలో ఉద్యోగులు ప్రభుత్వానికి సహకరించారో.. లేదో.. తెలియదు(పనిపరంగా కాదు.. రాజకీయ పరంగా) కానీ.. జగన్ పాలన విషయంలో ఉద్యోగులు రాజకీయ పరంగా కూడా ఆయనను వెనుకేసుకువచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించనన్న ప్రభుత్వానికి బాసటగా నిలిచి.. సుప్రీంకోర్టు వరకు వెళ్లి.. మొట్టికాయలు కూడా వేయించుకున్నారు. అంటే.. జగన్పై వారు ఎంత ఆశ పెట్టుకున్నారో తెలుస్తోంది. కానీ, వారి కోరికలను మాత్రం జగన్ తీర్చలేదు. దీంతో ఇప్పుడు వారు.. సర్కారుపై నమ్మకం కోల్పోతున్నారు.
ఇక, మరోవర్గం .. కాంట్రాక్టర్లు. ప్రభుత్వం ఏ చిన్న పనిచేయాలన్నా.. ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలన్నా.. కాంట్రాక్టర్లే కీలకం. వారు సొంత పార్టీ వారైనా.. మరెవరైనా.. కూడా. కాంట్రాక్టర్ల అవసరం ప్రభుత్వాలకు అత్యంత కీలకం. అయితే.. ఇప్పుడు జగన్ సర్కారు విషయంలో కాంట్రాక్టర్లు కూడా నమ్మకం కోల్పోయారు. దీనికి కారణం.. సకాలంలో నిదులు చెల్లించలేక పోవడం కాదు.. అసలు చెల్లిస్తారో.. లేదో.. తాము పెట్టిన కోట్ల రూపాయలు వస్తాయోలేదో.. అనే బెంగ వారిని పట్టిపీడిస్తోంది. ఇప్పుడు తాజాగా రాష్ట్రంలో రోడ్లను అభివృద్ధి చేయాలని భావించిన జగన్ రూ.2 వేల కోట్లు కేటాయిస్తున్నానని.. పనులు చేపట్టేందుకు ముందుకు రావాలని కాంట్రాక్టర్లకు పిలుపునిచ్చారు.
కానీ, ఒక్కరు కూడా ముందుకు రాలేదు. దీనికి కారణం.. ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడంతోనే. గత ప్రభుత్వంలో చేపట్టినపనులకు ఇప్పటికీ.. చాలా మందికి రాజకీయ కారణంగా.. జగన్ నిధులు ఇవ్వలేదు. ఇప్పుడు కూడా తన ప్రభుత్వంలో చేపట్టిన పపనులకు కూడా సగంసగమే ఇచ్చారు. దీంతో వారంతా.. బ్యాంకు గ్యారెంటీ ఇస్తే.. తప్ప పనులు చేపట్టేది లేదని భీష్మించారు. దీంతో హుటాహుటిన రంగంలోకి దిగిన ప్రభుత్వ అధికారులు కాంట్రాక్టర్లను మచ్చిక చేసుకునేందుకు బ్యాంకు గ్యారెంటీ ఇస్తామని చెప్పడం.. సర్కారుపై ఏవిధమైన సంకేతాలు వస్తున్నాయో.. అర్ధమవుతోందని అంటున్నారు పరిశీలకులు. మొత్తంగా చూస్తే.. ఏవిశ్వాసంతో అయితే.. అధికారంలోకి వచ్చారో.. ఆ విశ్వాసాన్ని జగన్ కేవలం రెండేళ్లలోనే పోగొట్టుకున్నారని అంటున్నారు పరిశీలకులు.