ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాట్సాప్ లో మెసేజులు పంపాడు అన్న కారణంతో ఒక టీచరును ఏపీ సర్కారు సస్పెండ్ చేసిన విషయం ఆలస్యంగా బయటకువచ్చింది. దీనిపై ఘాటుగా స్పందించిన లోకేష్… ఇది భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడి అని అన్నారు.
సర్వీస్ రూల్స్ కి విరుద్ధంగా అతన్ని సస్పెండ్ చేశారు. వెంటనే అతన్ని విధుల్లోకి తీసుకోవాలంటూ సర్కారుకి లోకేష్ అల్టిమేటం జారీ చేశారు.
విశాఖపట్నం జిల్లా నాతవరం మండలం ఉప్పరగూడెం ప్రాథమిక పాఠశాలలో SGT పనిచేస్తున్న ఎస్.నాయుడును జిల్లా విద్యాశాఖాధికారి సస్పెండ్ చేశారు. ఈ నెల 12వ తేదీనే సస్పెండ్ చేశారు. ఈ విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. దీనిపై లోకేష్ తీవ్రంగా స్పందించారు.
సామాజిక మాధ్యమాల్లో ఎవరో పంపిన మెసేజ్ ని ఫార్వార్డ్ చేస్తేనే ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తే, విద్యాబుద్ధులు నేర్పే గురువులకు తన చీప్ లిక్కర్ అమ్మే మద్యం దుకాణాల ముందు డ్యూటీవేసిన @ysjagan గారిని ఏం చెయ్యాలి? నడిరోడ్డు మీద ఉరి తియ్యాలా? అని లోకేష్ ప్రశ్నంచారు.
సామాజిక మాధ్యమాల్లో ఎవరో పంపిన మెసేజ్ ని ఫార్వార్డ్ చేస్తేనే ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తే, విద్యాబుద్ధులు నేర్పే గురువులకు తన చీప్ లిక్కర్ అమ్మే మద్యం దుకాణాల ముందు డ్యూటీవేసిన @ysjagan గారిని ఏం చెయ్యాలి? నడిరోడ్డు మీద ఉరి తియ్యాలా?(1/3) pic.twitter.com/XSdPIfQ2ia
— Lokesh Nara (@naralokesh) July 22, 2021
మాస్టారిపై తక్షణమే సస్పెన్షన్ ఎత్తివెయ్యాలి. జగన్ రెడ్డి పాలనలో టీచర్లను వేధించడం పరిపాటిగా మారింది. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం చేసే ప్రతి పోరాటానికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతిస్తుంది.(3/3)
— Lokesh Nara (@naralokesh) July 22, 2021
జగన్ రెడ్డి తాను చేసే తప్పుడు పనులను ఎవరైనా బయటపెడితే వణికిపోయి వారిపై చర్యలు తీసుకుంటున్నాడు. ప్రభుత్వ ఉద్యోగులను జగన్ అనేక రకాలుగా వేధిస్తున్నాడు. కనీసం నెలనెలా జీతాలు ఇవ్వలేని వ్యక్తి… ఉపాధ్యాయుల హక్కులను హరించడానికి మాత్రం ముందు ఉంటున్నాడని విమర్శించాడు లోకేష్.