ఓట్లు వేసి గెలిపించిన ప్రజలతో తిట్టించుకునే స్థాయికి చేరింది జగన్ పరిపాలన. అందరికీ అన్నీ ఇస్తా అన్న జగన్ … ఆయన ఏమీ ఇవ్వక్కర్లేదు మా దగ్గరున్నవి లాక్కోకపోతే చాలు సామీ అని దండం పెడుతున్నారు జనం.
అక్కడ ఇక్కడ అని కాదు అన్ని చోట్లా కూల్చివేతలే. ఇటీవల మంగళగిరిలో పేదల ఇల్లు ఖాళీ చేయించారు. ఇపుడు సీఎం ఇంటి వెనుక స్లమ్ ఎందుకు అంటూ తీసేయిస్తున్నారు. జగన్ ఇంటికి సమీపంలో పోలీసుల పహారాతో అర్ధరాత్రి కూల్చివేతలు చేయడం అత్యంత విచారకరం.
తమ ఇళ్లను కూలుస్తుంటే తట్టుకోలేక ఒక యువకుడు ఆత్మహత్యయత్నం చేశాడు. మరో మహిళ స్పృహ కోల్పోయింది.
అమరారెడ్డి కాలనీలో ఇళ్లు తొలగింపుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే సుమారు 200 ఇళ్లు వరకూ కూల్చేసిన అధికారులు… మిగిలిన వాటిని కూడా తొలగించేందుకు సిద్ధమయ్యారు. ఎంత దారుణం అంటే.. ఒకరోజు నోటీసు, కూల్చివేత జరిగాయి. మునుపటి తేదీతో నోటీసు ఇచ్చి వెంటనే కూల్చివేతకు సిద్ధమాయ్యరు. ఇంట్లో ఉన్నవారు గడువు కావాలని వేడుకున్నా వదల్లేదు.
ఇళ్లు కోల్పోయిన బాధితుల అరుపులు కేకలతో ముఖ్యమంత్రి నివాస ప్రాంతం మొత్తం ఉద్రిక్తంగా మారింది. నోటీసు ఇవ్వడానికి ముందు ఇంట్లో ఉంటున్న శివశ్రీ అనే యువతిని పోలీసులు పట్టుకెళ్లారు. స్థానికులు అఖిలపక్ష నాయకులు వెళ్లి గొడవచేయడంతో మధ్యాహ్నం రెండుగంటల సమయంలో వదిలేశారు. కూల్చివేతల కోసం వందలాది మంది పోలీసులు అక్కడకు చేరుకున్నారు.
కూల్చివేతలకు అడ్డువస్తే కేసులు పెడతామని బెదిరింపులకు దిగారు. ఎదురు మాట్లాడితే ఏ కేసులో ఇరికిస్తారో అనే భయంతో అమాయకులు ఏడుస్తున్నారు. ఇది ప్రజాప్రభుత్వం కాదు, జేసీబీ ప్రభుత్వం అని బాధితులు వాపోతున్నారు.
https://www.youtube.com/watch?v=St4AIpue_XQ