ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గురించి పరిచయం అక్కర లేదు. 80,90వ దశకంలో ముంబైతో పాటు బాలీవుడ్ నూ గుప్పిట్లో పెట్టుకున్న దావూద్ కు పలువరు అగ్ర హీరోల, హీరోయిన్లతో పరిచయాలున్నాయని టాక్ ఉంది. అంతేకాదు, అలనాటి అందాల తార, బాలీవుడ్ సిజ్లింగ్ బ్యూటీ మందాకినితో దావూద్ కు ఎఫైర్ ఉందని అప్పట్లో పుకార్లు షికార్లు చేసేవి. దానికి తగ్గట్టే వారిద్దరూ పార్టీలకూ కలిసి వెళ్లేవారు.
1980లలో తన అందచందాలతో కుర్రాళ్లను ఊపేసిన ‘రామ్ తేరీ గంగా మైలీ’ బ్యూటీతో డీ గ్యాంగ్ బాస్ దావూద్ దుబాయ్ లో కాపురం పెట్టాడని అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. ఆ పుకార్లకు ఊతమిచ్చేలా దావూద్ తో మందాకిని చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఫొటోలు అప్పట్లో సంచలనం రేపాయి. అయితే, దావూద్ తో ఎఫైర్ నేపథ్యంలో మందాకిని సినీ కెరీర్ అర్ధాంతరంగా ముగిసింది. 2002లో ఓ బెంగాలీ సినిమాలో కనిపించిన మందాకిని రీ ఎంట్రీ ప్రయత్నాలు వర్కవుట్ కాలేదు.
అయితే, తాజాగా మందాకిని రీ ఎంట్రీ ఫిక్సయిందని బీ టౌన్ లో ప్రచారం జరుగుతోంది. ఈ లెజెండ్రీ బాలీవుడ్ నటి ప్రస్తుతం కొన్ని స్క్రిప్ట్స్ పరిశీలిస్తోందట. ఏదైనా సినిమా లేదా వెబ్ సిరీస్ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వాలని ఈ 57 ఏళ్ల సీనియర్ నటి అనుకుంటోందట. స్క్రిప్ట్ నచ్చితే మందాకిని మళ్లీ తెరపై నటించేందుకు రెడీ అని ఆమె మేనేజర్ చెప్పాడు. మందాకిని హిందీ, బెంగాలీ సినిమాలతో పాటు సింహాసనం వంటి హిట్ చిత్రాల్లో నటించింది.