రాజకీయాల్లో కీలక నేతలు.. తీసుకునే నిర్ణయాలు చాలా చిత్రంగా ఉంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం విషయంలో జగన్ పైకి ఆచితూచి స్పందిస్తున్నానని.. తెలంగాణతో తాను విభేదాలు కోరుకోవడం లేదని, అక్కడ కూడా మన తెలుగు వారే ఉన్నారని.. సో.. తాను తెలంగాణతోనూ సఖ్యతగానే ఉంటానని అనేశారు. అయితే.. ఇది ఏపీకి సరిపోవడం లేదు. తెలంగాణ ప్రభుత్వం దూకుడుగా ముందుకు సాగుతున్న సమయంలో జగన్ ఈ విధంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. జగన్ రెండు కళ్ల సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నా యి.
ప్రస్తుతం ఏపీకి కావాల్సిన ప్రయోజనాల విషయంలో తెలంగాణ సర్కారు అనుసరిస్తున్న విధానాలు తీవ్ర ఇబ్బందికరంగా మారాయనేది నిర్వివాదాంశం. రెండు రాష్ట్రాలు విడిపోయి.. ఎవరి ప్రయోజనాల కోసం వారు పనిచేస్తున్న సమయంలో జగన్ ఇలా.. వ్యవహరించడం.. సరికాదనే వ్యాఖ్యలు మేధావుల నుంచి కూడా వినిపిస్తున్నా యి. జగన్ రెండు రాష్ట్రాల ప్రయోజనాలు కోరుతున్నారని.. వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నా.. తన ఆస్తుల కోసం.. తనపై ఉన్న కేసుల నేపథ్యంలో ఆయన ఇలా వ్యవహరిస్తున్నారనే వాదన బలంగా ఉంది. సోషల్ మీడియాలో కామెంట్లు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇక, సీమలోనూ ప్రతిపక్ష నేతలు ఇవే వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఈ పరిణామాలను గమనిస్తే.. ఇప్పుడు జగన్ అనుసరిస్తున్న విధానం ఆయనకు ఫ్యూచర్లో వర్కవుట్ కాదని.. మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గడం సమంజసమే అయినా.. ఏపీ పరువు పోతున్నా.. మౌనం పాటించడం సరికాదని అంటున్నారు. ఇప్పటికే హోదా వంటి కీలక విషయంలో జగన్ కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని.. ఇలాంటి పరిణామం.. అంతిమంగా ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. ప్రధానంగా ఎక్కడైతే.. జగన్కు పార్టీపరంగా మంచి పట్టుందని భావిస్తున్న రాయలసీమలోనే ఆయనకు, పార్టీకి ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతాయని చెబుతున్నారు. ఇప్పటికే రాయలసీమలో రైతాంగం జగన్కు వ్యతిరేకంగా మారిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.