ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో, బీజేపీ నిర్వహించే కార్యక్రమాల్లో ఎక్కడైనా కోవిడ్ నిబంధనలు ఫాలో అయిన ఫొటోలు చూశారా… కోవిడ్ నిబంధనలు కేవలం ప్రతిపక్షాలకు మాత్రమేనా? అధికార పక్షాలకు ఉండవా? ఏపీలో ఏం జరుగుతుందో ఎవరికైనా అర్థమవుతుందా?
తప్పు చేసిన వారిపై కేసు పెట్టాల్సిందే. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టం తన పని తాను చేయాల్సిందే. అయితే, ఎందుకు అధికార పార్టీ నేతలను వదిలేస్తున్నారననదే సామాన్యుల ప్రశ్న. జేసీపై, పరిటాలపై, అచ్చెన్నపై, పవన్ పై, సోముపై వంద కేసులు పెట్టండి. కానీ తప్పు చేసిన అధికార పార్టీ నేతలపై కూడా పెట్టండి. నిబంధనలను అందరికీ సమంగా అమలు చేయండి.
చట్టం ముందు అందరూ సమానమే. కానీ చివరకు ఏపీ హైకోర్టు కూడా ఏపీలో రూల్ ఆఫ్ లా లేదని వాపోయే పరిస్థితి. డీజీపీని పిలిపించి చెప్పినా అది ఎందుకు సాధ్యం కాదో తెలియని పరిస్థితి.
తాజాగా నిబంధనలు ఉల్లంఘించారని… టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, అతని కుమారుడు అస్మిత్ పై పోలీసులు ఇంకోసారి కేసు బుక్ చేశారు. హైదరాబాదులో చికిత్స తీసుకుని ఇంటికి వచ్చిన ఆయనకు అప్పటికే అనుకోకుండా అక్కడికి చేరుకున్న అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనుమతి లేకుండా స్వాగతం పలికిన నేరం కింద జేసీ కుటుంబంపై మరో 32 మందిపై తాడిపత్రి పోలీసులు కేసుపెట్టారు.