ఏపీ సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ కి మూడినట్టే ఉంది.
డీజీ హోదాలో సునీల్ కుమార్ విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని ఇటీవలే ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్రానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
దీనికి కేంద్ర హోంశాఖ రెస్పాండ్ అయ్యింది. ఆయన ప్రసంగాల వీడియోలు సమర్పించి, కఠిన చర్యలు ఏపీ సర్కారును ఆదేశించింది.
సునీల్ కుమార్ ప్రసంగాలు ప్రజల్లో అశాంతి రేకెత్తించేలా ఉన్నాయని, సమాజానికి మంచిది కాదని రఘురామరాజు చెప్పిన విషయాన్ని కేంద్రం అంగీకరించింది.
కేంద్ర హోంశాఖ నుంచి ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ అయ్యాయి.
ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి సంజీవ్ కుమార్ ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు లేఖ రాశారు. చర్యలు తీసుకుని, దాని వివరాలు కూడా వేగంగా కేంద్రానికి సమర్పించాలని అదే నోటీసులో ఏపీ సర్కారుకు సూచించారు.